Royal Enfield Meteor 350 Sundowner Orange: మోటోవెర్సె 2025లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ మెటోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ (Meteor 350 Sundowner Orange)ను లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ఫ్యాక్టరీ-ఫిటెడ్ టూరింగ్ ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన కొత్త పెయింట్ స్కీమ్‌ను అందిస్తుంది. కొత్త సన్‌డౌనర్ ఆరెంజ్ (Sundowner Orange) కలర్ వేరియెంట్ ఆరెంజ్ బేస్‌పై హైలైట్ షేడ్స్‌తో వచ్చింది. ఇది సూర్యాస్తమయం ప్రేరణతో రూపొందిన ప్రత్యేక లుక్‌ను అందిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్‌లపై ప్రత్యేక గ్రాఫిక్స్, అలాగే గ్లోబల్‌గా ఐదు లక్షల మీటియర్ రైడర్స్ మైలురాయిని గుర్తుచేసే ప్రత్యేక బ్యాడ్జ్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ జత చేసింది.
Local Body Elections : నోటిఫికేషన్ విడుదలైన రోజునే తొలి సర్పంచ్ ఏకగ్రీవం

దూర ప్రయాణాలు చేసే రైడర్ల కోసం మెటోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ లో డీలక్స్ టూరింగ్ సీట్ ఏర్పాటు చేశారు. ఇది మరింత వెడల్పైన కుషనింగ్, మెరుగైన లుక్ ఉండి, హైవే రైడింగ్ సమయంలో అత్యుత్తమ సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దీనిలో చిన్న ఫ్లైస్క్రీన్‌ను అమర్చారు. ఇది క్రూయిజింగ్ స్పీడ్‌లో గాలి ఒత్తిడిని తగ్గించి రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది ఇది దృఢమైన ఫ్రేమ్‌పై అమర్చబడినందున.. రాళ్లు ఉన్న రహదారులపై కూడా మంచి సపోర్ట్‌ను అందిస్తుంది. ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ ఈ స్పెషల్ ఎడిషన్‌లో స్టాండర్డ్‌గా అందిస్తుండటం మరో ముఖ్యమైన అప్డేట్. స్మార్ట్ కనెక్టెడ్ డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను అందిస్తూ అదనపు యాక్సెసరీల అవసరాన్ని తొలగిస్తుంది.
Top Selling Motorcycles: మరోసారి సత్తా చాటిన బడ్జెట్ బైక్.. అమ్మకాల్లో టాప్ 10 బైకులు ఏవంటే..?

ఈ బైకులో తొలిసారిగా అల్యూమినియం ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ప్రవేశపెట్టారు. ఇవి క్లాసిక్ స్పోక్ డిజైన్‌ను కొనసాగిస్తూ ట్యూబ్‌లెస్ టైర్లు ఉపయోగించే అవకాశం కల్పిస్తాయి. రైడర్లకు మరింత నియంత్రణ ఇవ్వడానికి అడ్జస్టబుల్ బ్రేక్, క్లచ్ లివర్స్ కూడా అందించారు. వీటితోపాటు ఫ్యాక్టరీ-ఫిటెడ్ LED హెడ్‌ల్యాంప్, USB-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా జోడించారు. ఇక మెకానికల్ అంశాల్లో మార్పులు ఏవీ చేయలేదు. ఇది పాత మోడల్‌లో ఉన్నట్లుగానే 349.34cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫైవ్-స్పీడ్ గేర్‌బాక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ రియర్ శాక్ అబ్జార్బర్స్, రెండు చక్రాల డిస్క్ బ్రేకులు, డ్యూయల్-చానల్ ABS అలాగే కొనసాగుతున్నాయి. ఇక ఈ బైకు రూ.2,18,882 ఎక్స్–షోరూమ్ ధరగా నిర్ణయించారు.
