హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ స్కూటర్ TVS iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకగా లభిస్తుంది. ధరలో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు. విడా V2 లైట్, ప్లస్, ప్రో అనే మూడు వేరియంట్లలో లభ్యం అవుతున్న విషయం తెలిసిందే. ఈ మూడింటి ధరలను తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది. విడా V2 లైట్‌కు రూ.22,000, విడా V2 ప్లస్‌కు ధర రూ.32,000, విడా V2 ప్రోకు రూ.14,700 మేర ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పూర్తి వివరాలకునికంగా ఉన్న షోరూంలు, వెబ్‌సైట్లను సంప్రదించగలరు.
READ MORE: Bhatti Vikramarka : ఒడిశాలో నైనీ గని ప్రారంభం.. సింగరేణికి జాతీయ విస్తరణలో కొత్త అధ్యాయం
విడాV2 Lite 2.2 kWh బ్యాటరీని కలిగి ఉంది. దీని రేంజ్ 94 కి.మీ. దీని గరిష్ట వేగం గంటకు 69 కి.మీ. అలాగే ఇందులో 7-అంగుళాల TFT డిస్ప్లే, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, రీజెనరేటివ్ బ్రేకింగ్, కీలెస్ ఎంట్రీ, రెండు రైడింగ్ మోడ్‌లు (ఎకో మరియు రైడ్) ఉన్నాయి. విడా V2 ప్లస్ 3.44 kWh బ్యాటరీని కలిగి ఉంది. దాని రేంజ్ 143 కి.మీ. (ఐడిసి). ఇది గంటకు 85 కి.మీ. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, వాహన టెలిమాటిక్స్ ఉన్నాయి. విడా V2 ప్రోలో 3.94 kWh బ్యాటరీ ఉంది. దీని పరిధి 165 కి.మీ. (ఐడిసి). గరిష్ట వేగం గంటకు 90 కి.మీ.
READ MORE: Kancha Gachibowli: కంచ గచ్చిబౌలి భూములపై సీఈసీ కీలక నివేదిక.. పర్యావరణ పరిరక్షణకు మద్దతు