Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో సీనియర్ నక్సలైట్‌తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు.
Kim Jong Un: ఉత్తర కొరియా అంటేనే నిగూఢ దేశం. ఆ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి అసలు తెలియదు. ఎవరైనా తెలుసుకునేందుకు ప్రయత్నించారో అంతే సంగతి. నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో నార్త్ కొరియా మగ్గిపోతోంది. అక్కడ ఉన్న ప్రజలకు బయట మరో ప్రపంచం ఉందనే విషయం కూడా తెలియకుండా బతుకుతున్నారు. చిత్రవిచిత్రమైన రూల్స్, శిక్షలు ఒక్క ఉత్తర కొరియాలోనే సాధ్యం.
Trump tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్‌తో ప్రపంచదేశాలు విసిగిపోయాయి. ప్రపంచంలోనే పలు ప్రధాన దేశాలపై ఆయన సుంకాలు విధించారు. అన్ని దేశాల కన్నా ఎక్కువగా భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. దీనికి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తున్నారనే సాకు చెబుతున్నారు.
Bengaluru: బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్‌కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్‌ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్‌ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
Insurance: ఢిల్లీలో సోమవారం, కొత్త మహీంద్రా థార్ కారు షోరూం నుంచి బయటకు తీస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి అంతస్తు నుంచి, అద్దాలను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘‘సెక్యూరిటీ ప్రోటోకాల్’’ పాటించడం లేదని ఆయనకు భద్రత కల్పిస్తున్న రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) చెప్పింది. ఈ మేరకు సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించారు. రాహుల్ గాంధీ తన భద్రతా కవరేజీని ‘‘సీరియస్’’గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆయన ఎవరీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్తున్నారని చెప్పారు.
Charlie Kirk: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతుదారు, సన్నిహతుడిగా పరిగణించే చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఉటా లోని యూనివర్సిటీ ప్రాంగణంలో వేలమంది ఆయన ప్రసంగాన్ని వినేందుకు గుమిగూడిన క్షణంలో ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కిర్క్‌ను ‘‘అమెరికాకు అంకితమైన దేశభక్తుడు’’గా కొనియాడారు. ఆయన మరణం అమెరికాకు చీకటి క్షణంగా అభివర్ణించారు.
Israel: 9/11 దాడుల తర్వాత అమెరికా ఏం చేసింది, తాము కూడా అదే చేస్తున్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాపై అమెరికా స్పందించినట్లే తాము ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ పొలిటికల్ బ్యూరోపై దాడులు చేశామని సమర్థించుకున్నారు. ఖతార్, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న ఇతర దేశాల వారిని బహిష్కరించాలని లేదా వారిని న్యాయం ముందు నిలబెట్టాలని ఆయన అన్నారు. ‘‘మీరు అలా చేయకుంటే మేము చేస్తాం’’ అని నెతన్యాహూ అన్నారు. అంతర్జాతీయంగా ఈ దాడిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో…
PM Modi: హమాస్ పొలిటకల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. దాడిపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆందోళన తెలియజేశారు. తాను ఈ విషయమై ఖతాన్ ఎమిర్‌తో మాట్లాడానని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించానని, వివాదాలు పరిష్కరించుకోవడానికి చర్చించుకోవాలని పిలుపునిచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు. Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు! […]
Nepal Palace Massacre: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలకు తలొగ్గి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రివర్గంలోని పలువురు మంత్రులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పుడు నేపాల్‌లో మరోసారి రాచరికం మళ్లీ వస్తుందా అనే వాదన మొదలైంది.