Charlie Kirk: ట్రంప్ సన్నిహితుడు, మేక్ అమెరికా గ్రేట్ అగెన్(MAGA) క్యాంపెన్‌ను నిర్వహించిన రిపబ్లికన్ మద్దతుదారు చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన ఘటన అమెరికాతో పాటు యావత్ ప్రపంచంలో సంచలనంగా మారింది. యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా చార్లీ కిర్క్‌కు పేరుంది.
అయితే, మాజీ నేపాల్ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఈమె భర్త 52 ఏళ్ల క్రితం విమానం హైజాక్‌కు పాల్పడినట్లు చాలా తక్కువ మందికి తెలుసు. 1973 విమాన హైజాకింగ్‌లో కర్కీ భర్త , నేపాలీ కాంగ్రెస్ మాజీ యువ నేత దుర్గా ప్రసాద్ సుబేది కీలకంగా వ్యవహరించారు.
HIRE Act: సుంకాలతో భారత్‌ను ఇబ్బంది పెడుతున్న ట్రంప్ సర్కార్ మరో కొత్త చట్టానికి పదును పెడుతోంది. భారత ఐటీ రంగాన్ని ఈ చట్టం టార్గెట్ చేస్తుంది. దీంతో, అమెరికాలోనే క్లయింట్లకు సేవల్ని అందిస్తున్న భారతీయ ఐటీ సంస్థలు, ఉద్యోగులు తీవ్ర ప్రభావం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒహియోకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ బెర్నీ మోరెనో ప్రవేశపెట్టిన హాల్టింగ్ ఇంటర్నేషనల్ రిలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ (HIRE) చట్టం, ఆమోదం పొందితే అమెరికన్ కంపెనీలు విదేశీ కార్మికులనున నియమించుకునే […]
Nepal unrest: రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలితో పాటు చాలా మంది మంత్రలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు, అల్లర్లలో చాలా మంది లూటీలకు తెగబడ్డారు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 51 మంది మరణించారు. మరణించిన వారిలో ఒక భారతీయురాలు కూడా ఉంది.
Nepal: అవినీతికి వ్యతిరేకంగా నేపాల్ యువత నిర్వహించిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించడంతో ఒక్కసారిగా యువత రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపింది. సోమవారం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించడంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
PM Modi Manipur Visit: జాతి ఘర్షణలతో రెండేళ్లుగా అట్టుడుకుతున్న మణిపూర్‌కు ప్రధాని నరేంద్రమోడీ రేపు వెళ్లనున్నారు. మే 2023లో రాష్ట్రంలో చెలరేగిన హింస తర్వాత తొలిసారి ప్రధాని పర్యటనకు వెళ్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధ్రువీకరించారు. ఈ పర్యటన గురించి చాలా రోజుల నుంచి ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ, తొలిసారిగా అధికారిక ప్రకటన వచ్చింది.
USA: రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితేనే భారతదేశంతో వాణిజ్య ఒప్పందం ముందుకు సాగుతుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ అన్నారు. భారత్‌తో వాణిజ్యం, రష్యన్ ఆయిత్ దిగుమతులు ఆపివేయడంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. ట్రంప్ 50 శాతం సుంకాలతో ఇరు దేశాల ఉద్రిక్తతల మధ్య లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Charlie Kirk: హత్యకు గురైన ట్రంప్ సన్నిహితుడు, మద్దతుదారు చార్లీ కిర్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అత్యున్నత పౌరపురస్కారమైన ‘‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’’ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉటా యూనివర్సిటీలో కిర్క్‌ను ఓ ఆగంతకుడు కాల్చి చంపాడు. క్యాంపస్‌లోని సోరెన్సెన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించిన డిబేట్ సమయంలో హత్యకు గురయ్యారు. మరణానంతరం ట్రంప్ కిర్క్‌కి ఈ అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించారు.
CP Radhakrishnan: ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్టప్రతి భవన్లో ఉదయం 10 గంటలకు జరగనున్న కార్యక్రమంలో రాధాకృష్ణన్ తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలిపారు.
Dowry Harassment: వరకట్న దాహానికి మరో మహిళ బలైంది. పెళ్లయినప్పటి నుంచి అత్తామామల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర లోని జల్గావ్ లో జరిగింది. 23 ఏళ్ల మయూరి గౌరవ్ తోసర్ ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగిన నాలుగు నెలల తర్వాత, ఆమె పుట్టినరోజు తర్వాతి రోజు బలవన్మరణానికి పాల్పడింది. Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ దాతృత్వం.. 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం.. మయూరిని గత కొన్ని రోజులుగా […]