Yogi Adityanath: గోరఖ్‌నాథ్ ఆలయ ప్రాంగణంలో మహంత్ దిగ్విజయనాథ్ 56వ వర్ధంతి మరియు మహంత్ అవైద్యనాథ్ 11వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘‘ ఈరోజు భారతదేశంలో అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో ఉన్న గొప్ప ఆలయాన్ని చూసి ఎవరు గర్వపడరు..? ఎవరైనా గర్వంచకపోతే, వారు భారతీయులనేది సందేహమే’’ అని ఆదిత్యనాథ్ అన్నారు. Read Also: Bellamkonda : కిష్కింధపురి లాంటి హారర్ సినిమా అందరితో కలిసి థియేటర్స్ లో చూడండి […]
Sushila Karki: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువతి చేసిన నిరసనలు నేపాల్‌లో హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైకి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. దీంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం, దేశాన్ని ఆర్మీ తన కంట్రోల్‌కి తీసుకుంది. ఇదిలా ఉంటే, నేపాల్‌కు కాబోయే తదుపరి ప్రధానమంత్రిపై చర్చించడానికి 5000 […]
Nepal: నేపాల్‌లో సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా యువత నిర్వహించి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. అనేక మంది మంత్రులు కూడా రాజీనామాలు సమర్పించారు. గత కొన్నేళ్లుగా అవినీతి, బంధు ప్రీతితో రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. ప్రస్తుతం, నేపాల్‌లో శాంతిభద్రత పరిస్థితులను ఆర్మీ చేతుల్లోకి తీసుకుంది.
Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు […]
Nepal: నేపాల్‌లో ప్రజాస్వామ్యం అనే ప్రయోగం విఫలమైంది. 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు నేపాల్ ను పాలించాయంటే, అక్కడి అస్థిరత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008లో ‘‘రాచరికం’’ పోయిన తర్వాత, ప్రజాస్వామ్య దేశంగా మారిన నేపాల్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. చివరకు అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయింది.
Supreme Court: సుప్రీంకోర్టు బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. బుధవారం సుప్రీంకోర్టులో ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించి బిల్లును క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది.
Israel Strikes Qatar: అరబ్ దేశాల్లో అమెరికాకు అత్యంత మిత్రదేశంగా ఖతార్ ఉంటుంది. అలాంటి ఖతార్‌పై మంగళవారం ఇజ్రాయిల్ దాడులు చేసింది. రాజధాని దోహాలో ఉన్న హమాస్ పొలిటికల్ బ్యూర్ నేతలే టార్గెట్‌గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అయితే, ఇదంతా అమెరికాకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. కానీ, ఇజ్రాయిల్ దాడి చేసే విషయాన్ని, అమెరికా ఖతార్‌కు ఆలస్యంగా తెలియజేసిందని తెలుస్తోంది. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు
Surnames: భారతదేశంలో కొన్ని ‘‘ఇంటిపేర్లు’’ కలిగిన వారు ఎక్కువగా వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వంశపారంపర్యంగా వ్యాపారమే వారి వృత్తిగా మారింది. అలాంటి వారే దేశంలో అత్యంత సంపన్నమైన ఫ్యామిలీ బిజినెస్‌ని నిర్వహిస్తున్నారు. 2025 హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం ఆసక్తికరమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి. నివేదిక ప్రకారం, ‘‘అగర్వాల్’’, ‘‘గుప్తా’’ అనే ఇంటిపేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ రెండు ఇంటిపేర్లకు సంబంధించిన చెరో 12 కుటుంబాలు దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. Read Also: Whatsapp […]
Karnataka: కర్ణాటకలోని శివమొగ్గ, విజయపుర జిల్లాల్లో జరిగిన ఈద్ మిలాద్ వేడుకలు వివాదాలకు కేంద్రంగా మారాయి. రెచ్చగొట్టే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ పాకిస్తాన్ అనుకూల వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. వీటిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Sathyan Sivakumar: సినీ ఇండస్ట్రీ మెరిసే ప్రపంచం. బయటకు ఎంతో గ్లామరస్‌గా, జాలీగా కనిపించినా, లోలోపల మాత్రం ఎన్నో విషాదాలు ఉంటాయి. సక్సెస్ వస్తే స్టార్, వరసగా ఫెయిల్యూర్ ఎదురైతే అంతే సంగతి. ఇలా చాలా మంది జీవితాలు తలకిందులుగా మారిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క తప్పటడుగు మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది.