Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోతమోగింది. గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో సీనియర్ నక్సలైట్‌తో సహా 10 మంది నక్సల్స్ హతమయ్యారు. మరణించిన వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్ కూడా ఉన్నారు. ఇతడిని మోడెం బాలకృష్ణ అని కూడా పిలుస్తారు. ఇతడిపై రూ. 1 కోటి బహుమతి ఉంది. మెయిన్‌పూర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు, E-30, STF, కోబ్రా బలగాలు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.
Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ దాతృత్వం.. 1500 వరద బాధిత కుటుంబాలకు సాయం..
గురువారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, నక్సల్స్ మధ్య కాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో పలువురు సీనియర్ నక్సల్స్ మరణించి ఉండొచ్చని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో కోబ్రా బలగాలు, రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత, గ్రౌండ్ వెరిఫికేషన్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారం రానుంది.