IT Layoffs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి. ఆర్థికమాంద్యం భయాలు, అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ఐటీలో సంక్షోభానికి కారణం అవుతున్నాయి. ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలు అయిన మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను విసిరి అవతలపారేశాయి.
Read Also: Fevikwik Treatment: ఇదొక కొత్త టెక్నిక్.. కుట్లకు బదులు చిన్నారికి ఫెవిక్విక్‌తో వైద్యం
ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త మాత్రం లేఆఫ్స్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపించింది. అమెరికాకు చెందిన ఓ సైబర్ సెక్యూరిటీ బిషప్ ఫాక్స్ తన ఉద్యోగులకు బ్రాండెడ్ డ్రింక్స్ తో భారీగా పార్టీ ఏర్పాటు చేసింది. కంపెనీ ఏర్పాటు చేసిన పార్టీ, పైసా ఖర్చు లేదు. దీంతో ఉద్యోగులంతా పార్టీని తెగ ఎంజాయ్ చేశారు. ఆ తరువాత 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో కంగుతిన్నారు ఉద్యోగులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఖర్చులను ఆదా చేసుకునేందుకు ఈ లేఆఫ్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.
‘సైబర్ సూప్’ పేరుతో పెద్దగా పార్టీ ఇచ్చింది, ఆ తరువాత కంపెనీ ఓ ట్వీట్ లో.. ఈ ఏడాది లాస్ వేగాస్ లో ఈవెంట్ నిర్వహిచనున్ట్లు వెల్లడించింది. కట్ చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. బిషప్ ఫాక్స్ కంపెనీలో 400 మంది పనిచేస్తే వీరిలో 13 శాతం అంటే 50 మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. మా వ్యాపారం స్థిరంగా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ విన్నీ లియు అన్నారు.