IT companies: ఆర్థికమాంద్య భయాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితులు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. స్టార్టప్స్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి. అయితే ఈ ప్రభావం ఇప్పటి వరకు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీపై పెద్దగా ప్రభావం చూపించకున్నా..ఏదో ఓ సమయంలో మనదగ్గర కూడా ఉద్యోగుల తొలగింపు ఉండే అవకాశం ఉందని టెక్కీలు భయపడుతున్నారు.
Read Also: US Debt Ceiling Crisis: కుదరని ఏకాభిప్రాయం.. ఆర్థిక సంక్షోభం అంచున అమెరికా..
ప్రముఖ రిక్రూట్మెంట్ సంస్థ టీమ్‌లీజ్ డిజిటల్ ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఐటీ కంపెనీలు 40 శాతం తక్కువ ప్రెషర్లను నియమించుకోవచ్చని పేర్కొంది. లైవ్ మింట్ నివేదిక ప్రకారం భారతీయ ఐటీ కంపెనీలు 2023 ఆర్థిక సంవత్సంలో 2,30,000 ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ జరిగితే.. 2024లో ఇది 1,55,000 ఉండొచ్చని పేర్కొంది. విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ ఉటంకిస్తూ.. ఇప్పటికే జాబ్ ఆఫర్స్ అందించిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నామని.. అందుకే క్యాంపస్ రిక్రూట్మెంట్ల జోలికి వెళ్లడం లేదని పేర్కొంది.
తగ్గుతున్న అట్రిషన్ రేట్లు, కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా నియామకాలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆయన అన్నారు. విప్రో ఫిబ్రవరిలో ఫ్రెషర్స్ ఉద్యోగాల ఆఫర్‌లను దాదాపు 50 శాతం తగ్గించాలని నిర్ణయించుకోవడంతో వార్తల్లో నిలిచింది. ముందుగా రూ.6.5 సాలరీ ప్యాకేజ్ అందిస్తామని ప్రకటించి.. ఆ తరువాత సగానికే పనిచేయాలని కోరింది.