Powassan Virus Disease: కరోనా, మంకీపాక్స్, ఎబోలా ఇలా పలు రకాల వైరస్ లు మానవాళిపై దాడులు చేస్తున్నాయి. కొత్తకొత్త రోగాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అత్యంత ప్రాణాంతకమైన ‘‘పోవాసాన్ వైరస్ వ్యాధి’’ సోకి అమెరికాలో ఒకరు మరణించారు. పేల ద్వారా సోకే ఈ వైరస్ చాలా ప్రాణాంతకమైందని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ప్రతీ ఏడాది 25 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇటీవల మైనేలో 2015 తర్వాత సంభవించిన మూడో మరణం ఇదే అని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
పోవాసాన్ వైరస్ సాధారణంగా జింక పేలు, గ్రౌండ్ హాగ్ పేలు లేదా స్క్విరెల్ పేలు కుట్టడం ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. పోవాసాన్ వైరస్ అత్యంత అరుదుగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఇటీవల కాలంలో మరిన్ని కేసులు నమోదు అయ్యాయి. అమెరికాతో పాటు కెనడా, రష్యాల్లో కూడా పోవాసాన్ వైరస్ ఇన్ఫెక్షన్లు బయటపడ్డాయి.
Read Also: CPM Protest : ఎస్‌ఐ అత్యుత్సాహం.. సీపీఎం నేతలపై చేయి చేసుకున్న వైనం
లక్షణాలు:
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, పొవాస్సాన్ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. వైరస్ కలిగిన పేలు కాటేసిన వారం నుంచి నెల మధ్యలో అనారోగ్యంగా అనిపిస్తుంది.
జ్వరం, తలనొప్పి, వాంతులు, బలహీనత ప్రారంభ లక్షణాలుగా ఉంటాయి.
పోవాసాన్ వైరస్ మెదడు, వెన్నుపాము చుట్టూ ఉన్న పోరపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
వ్యాధి ముదిరితే గందరగోళంగా ఉండటంతో పాటు సమన్వయం కోల్పోవడం, మాట్లాడటం కష్టంగా మారడంతో పాటు మూర్చ లక్షణాలు ఉంటాయి.
తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న 10 మందిలో ఒకరు మరణిస్తుంటారు.
తీవ్రమైన వ్యాధి నుంచి బయటపడే వ్యక్తులు రిపీటెడ్ తలనొప్పితో , కండరాల బలం తగ్గిపోవడం, జ్ఞాపకశక్తి సమస్యలను దీర్ఘకాలికంగా ఎదుర్కొంటారు.
చికిత్స:
పోవాసాన్ వైరస్ సంక్రమణను నివారించడానికి, చికిత్స చేయడానికి మందులు లేవు. యాంటీబయాటిక్స్ వైరస్లకు చికిత్స చేయవు.
విశ్రాంతి, ఫ్లూయిడ్స్ మరియు ఓవర్-ది-కౌంటర్ పెయిన్ మందులు ద్వారా కొన్ని లక్షణాల నుండి ఉపశమనం పొందవచ్చు.
తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా శ్వాస తీసుకోవడానికి, హైడ్రేటెడ్‌గా ఉండటానికి లేదా మెదడులో వాపును తగ్గించడానికి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది.