Nuh communal clashes: నూహ్ మతఘర్షణల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం.. అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nuh communal clashes: హర్యానా నూహ్ ప్రాంతంలో ఆగస్టు నెలలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపుగా వెళ్తున్న హిందువులపై కొంతమంది ముస్లింలు కావాలని దాడులకు పాల్పడ్డారు. భవనాలపై రాళ్లు విసరడమే కాకుండా, ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ అల్లరల్లో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ హస్తం ఉందని తేలింది. విశ్వహిందూ పరిషత్ (VHP) యాత్ర తర్వాత జరిగిన హింసలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందనే దానికి సరైన ఆధారాలు ఉన్నాయని హర్యానా పోలీసులు వెల్లడించారు.
Read Also: Patna: తాంత్రికుడు చెప్పడంతో కొడుకు కోసం కూతుళ్లను రేప్ చేసిన తండ్రి.. జీవత ఖైదు
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిరోజ్ పూర్ జిర్కాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంగళవారం పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు, ఈ విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది కోర్టు. హింస జరిగే రోజున తాను నూహ్ లో లేనని, తనను తప్పుడు కేసులో ఇరికించారని మమ్మల్ ఆరోపించారు. తగిని ఆధారాలు దొరికిన తర్వాతనే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిందితుడిగా పేర్కొన్నట్లు హర్యానా పోలీసులు కోర్టు తెలియజేశారు. ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఫోన్ కాల్ రికార్డింగ్స్, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపారు. మమ్మన్ ఖాన్ ను శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నారు.
దీనికి ముందు పోలీసులు ఎమ్మెల్యే మమ్మన్ ఖాన్ కి రెండుసార్లు తమ ముందు హాజరుకావాలని సమస్లు పంపారు. జ్వరం కారణంగా పోలీసుల సమన్లకు హాజరుకాలేదు. ఐజీ స్థాయి అధికారితో కూడాని ఉన్నత స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసేలా హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఖాన్ తరుపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిట్ స్వతంత్రంగా పనిచేస్తుందని, ఈ కేసును సిట్ కి బదిలీ చేయాలని ఆయన అభ్యర్థించారు. జూలై 31న నూహ్ లో వీహెచ్‌పీ తలపెట్టిన ర్యాలీలో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఊరేగింపు నూహ్ పట్టణానికి రాగానే ఒక్కసారిగా దాడి జరిగింది. ఈ దాడి అనంతరం హర్యానా ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది. అక్రమ కట్టడాలను కూల్చేసింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!