PM Modi: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యతతో అధికారం చేపట్టబోతోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించింది. ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోడీ ‘చారిత్రక, అపూర్వ’ విజయంగా కొనియాడారు. దేశాన్ని కులాల వారీగా విభజించేందుకు ప్రయత్నాలు చేసిందని, కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేపడతానని రాహుల్ గాంధీ పదేపదే చెప్పారు. కాంగ్రెస్ వాగ్ధానంపై మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
మూడు రాష్ట్రాల్లో గెలుపు అనంతరం ఆదివారం రాత్రి కార్యకర్తలను, నేతలు ఉద్దేశించి ప్రసంగించారు. నేటి విజయం చారిత్రత్మకమని, అపూర్వమైందని, నేడు ‘సబ్ కా సాత్-సబ్ కా వికాస్’ విజయం సాధించిందని అభివృద్ధి చెందుతున్న భారత్, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం గెలిచిందని ఆయన అన్నారు. నేడు నిజాయితీ, సుపరిపాలన గెలిచిందని ప్రధాని ప్రకటించారు. తనకు నాలుగు కులాలు ముఖ్యమని అవి నారీ శక్తి, యువశక్తి, కిసాన్ ఔర్ గరీబ్ పరివార్ ప్రధాని మోడీ చెప్పారు. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ అంచనాలకు దూరంగా ఉండే వాడినని, కానీ ఈసారి మాత్రం రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని ముందే చెప్పానని, రాజస్థాన్ ప్రజలు విశ్వాసంతో ఈ వ్యాఖ్యలు చేశానని ప్రధాని అన్నారు.
Read Also: Congress: రేపే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం!
అవినీతి, కుటుంబ పాలనకు ఓటర్లు చెక్ పెట్టారని ప్రధాని అన్నారు. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని, దేశాన్ని బలహీనం చేసే రాజకీయాలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నానని ప్రధాని మోడీ చెప్పారు. ఈ తీర్పు ఓ హెచ్చరిక లాంటిదని ఆయన అన్నారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం 2024 విజయానికి బాటుల వేసిందని అన్నారు. దేశంలో పేదలకు ఇళ్లను, ప్రతీ ఇంటికి నీటిని అందిస్తున్నామని, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో దూసుకెళ్తోందని, ప్రతీ గ్రామానికి ఫైబర్ ఆప్టిక్ సౌకర్యాలు కల్పిస్తున్నామని, కొత్త రైల్వే స్టేషన్లను నిర్మిస్తున్నామని అన్నారు.