Khalistani terrorist: భింద్రన్‌వాలే మేనల్లుడు ఖలిస్తాన్ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడ్ పాకిస్తాన్‌లో మరణించాడు. భారత వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడుతున్న ఇతను చాలా కాలంగా పాకిస్తాన్‌లోనే ఉంటున్నాడు. అక్కడి నుంచే భారత వ్యతిరేక, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నాడు. ఇతనికి పాక్ ప్రభుత్వంతో పాటు ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Read Also: Revanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి..? నిర్ణయం పూర్తైందన్న రాహుల్ గాంధీ..
లఖ్బీర్ సింగ్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే బంధువు. లఖ్బీర్ సింగ్ డిసెంబర్ 2న పాకిస్తాన్‌లో మరణించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గుండెపోటుతో అతను మరణించాడని సమాచారం. సిక్కు ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం పాకిస్తాన్‌లో అతని అంత్యక్రియలు జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భింద్రన్‌వాలే ఖలిస్తాన్ మొదటి నాయకుడు. ఆపరేషన్ బ్లూస్టార్‌లో ఇతడిని ప్రభుత్వం హతమార్చింది. ఈ సంఘటనే ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు కారణమైంది.
లఖ్బీర్ సింగ్ రోడ్ పాక్ ఆదేశాల మేరకు పంజాబ్‌లో భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అక్టోబర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తీవ్రవాద నిరోధక సంస్థ చేసిన దాడి తరువాత రోడ్ యొక్క ఆస్తులను జప్తు చేసింది. పంజాబ్ మోగాలో సోదాలు కొనసాగాయి. 2021-23 మధ్య ఆరు ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి. ఇతను నిషేధిత ‘ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్’కి చీఫ్‌గా ఉన్నాడు. ప్రభతు్వం ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది.