Maruti Suzuki Jimny: మారుతి సుజుకీ జిమ్నిపై రూ.2.21 లక్షల వరకు తగ్గింపు.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్ని.. ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది. మహీంద్రా నుంచి ఆఫ్ రోడర్‌గా ఉన్న థార్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు మారుతి సుజుకీ జిమ్నిని మార్కెట్‌లోకి దించింది. థార్‌లో ఉన్న నెగిటివ్ పాయింట్ అయిన 5-డోర్ సమస్యను పరిష్కరిస్తూ.. జిమ్ని 5-డోర్‌తో వచ్చింది.
ఇదిలా ఉంటే, జిమ్ని మార్కెట్ లోకి లాంచ్ అయిన 7 నెలలకే రూ. 2.21 లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. మరింత మంది వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చే. ప్రస్తుతం జిమ్నిని మారుతి నెక్స్ నెట్వర్క్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇగ్నిస్, బాలెనో, సియాజ్, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, ఇన్విక్టో వంటి ప్రీమియం మోడళ్లను నెక్సా ద్వారా అందిస్తోంది.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
అయితే, వినియోగదారుల నుంచి ఆలోచిస్తే జిమ్ని ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు వినియోగదారులు బెట్టర్ రోడ్ ప్రెజెన్స్ కారణంగా మహీంద్రా థార్ వైపు మొగ్గు చూపుతున్నట్లు పలువురు డీటర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫ్ రోడర్ విభాగంలో ఫ్యామిలీ కార్‌గా కూడా వాడుకునే అవకాశం ఉండటం జిమ్నీకి కలిసి వస్తోంది.
Read Also: Congress Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నజర్..
జిమ్నీ లాంచ్ సమయంలో రెండు వేరియంట్లతో వచ్చింది. ధరలు ఈ విధంగా(ఎక్స్-షోరూం) ఉన్నాయి.
జీటా MT – రూ. 12.74 లక్షలు
జీటా ఏటీ – రూ. 13.94 లక్షలు
ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు
ఇదిలా ఉంటే ప్రస్తుతం జీటా వేరియంట్((MT మరియు AT) రూ. 2.21 లక్షల వరకు( రూ. 2.16 లక్షలు కన్జూమర్ ఆఫర్, రూ.5,000 కార్పొరేట్ బోనస్) వరకు తగ్గింపు కలిగి ఉండగా.. ఆల్ఫా వేరియంట్లో వినియోగదారులు రూ. 1.21 లక్షల వరకు (రూ. 1.16 లక్షల వినియోగదారు ఆఫర్ మరియు రూ. 5,000 కార్పొరేట్ బోనస్) తగ్గింపులను పొందవచ్చు.
ఇదిలా ఉంటే జిమ్నిని మరింత తక్కువ ధరలోకి తీసుకురావడానికి ప్రతీ వేరియంట్ పై థండర్ స్పెషల్ ఎడిషన్‌ని తీసుకువచ్చింది. థండర్ స్పెషల్ ఎడిషన్ ధరలు(ఎక్స్-షోరూం) ఈ విధంగా ఉన్నాయి.
Zeta MT థండర్ – రూ. 10.74 లక్షలు
జీటా ఏటీ థండర్ – రూ. 11.94 లక్షలు
ఆల్ఫా MT థండర్ – రూ. 12.69 లక్షలు
ఆల్ఫా ఏటీ థండర్ – రూ. 13.89 లక్షలు
ఆల్ఫా MT థండర్ (డ్యూయల్ టోన్) – రూ. 12.85 లక్షలు
ఆల్ఫా ఏటీ థండర్ (డ్యూయల్ టోన్) – రూ. 14.05 లక్షలు
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!