NCRB Report: దేశంలో అత్యధిక ఆత్మహత్యలు ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజా నివేదిక పేర్కొంది. ప్రతీ లక్ష మంది జనాభాకు సిక్కింలోనే అత్యధిక ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కింలో 43.1 శాతం ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కిం తర్వాతి స్థానాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో 42.8 శాతం, పుదుచ్చేరిలో 29.7 శాతం, కేరలలో 28.85 శాతం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 28.2 శాతం ఆత్మహత్య మరణాలు నమోదయ్యాయి.
Read Also: Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం
ఆత్మహత్యల్లో జాతీయ సగటు 2022లో 12.4 శాతం ఉంది. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 1,70,924 ఆత్మహత్యలు నమోదయ్యాయి. సిక్కిం రాష్ట్రంలో 2022లో 293 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2021లో కంటే 27 ఎక్కువ. ఆత్మహత్యల రేటు 10.2 శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. సిక్కింలో మొత్తం 226 మంది పురుషులు మరియు 67 మంది మహిళలు ఆత్మహత్యలతో మరణించారు. ఆత్మహత్యల్లో 83 మరణాలు నిరుద్యోగం మూలంగా జరిగాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం సిక్కిం జనాబా 6.10 లక్షలకు పైగా ఉంది. అంతకుముందు రెండేళ్లలో, అండమాన్ మరియు నికోబార్ దీవులు దేశంలో అత్యధిక ఆత్మహత్యల రేటు కలిగి ఉంది.