Railways: మీరు ప్రయాణం కోసం రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు, హఠాత్తుగా వెళ్లాల్సిన కార్యక్రమం తేదీ మారింది. అలాంటి సమయంలో జర్నీ డేట్ మార్చడానికి గతంలో వీలు కలిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల్ని తీర్చడానికి భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా, బుక్ చేసుకున్న టికెట్ల ప్రయాణ తేదీలను మార్చడానికి భారతీయ రైల్వే అనుమతినిచ్చింది. ప్రస్తుతం, ప్రయాణికుడు తన ప్రయాణ తేదీని మార్చడానికి వారికి బుక్ అయిన టికెట్‌ను రద్దు చేసుకుని, కొత్తదాన్ని బుక్ చేసుకుంటున్నారు. జనవరి నుంచి కొత్త విధానం అమలులోకి రాబోతోన్న కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికుడి ఇబ్బందులు తీరనున్నాయి.
జనవరి నుంచి, ప్రయాణికులు తమకు కన్ఫామ్ అయిన రైలు టికెట్ ప్రయాణ తేదీని ఎలాంటి రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం, ప్రయాణికులు ప్రయాణ తేదీని మార్చుకునే వీలు లేదు. తనకు బుక్ అయిన టికెట్‌ను రద్దు చేసుకుని, కొత్తదానిని బుక్ చేసుకోవాలి. వారి ప్రయాణ తేదీ టైమ్ ఆధారంగా రీఫండ్ వస్తుంది. ఇది ప్రయాణికులకు అసౌకర్యంగా కనిపిస్తుంది.
Read Also: University : దేవతల పసుపు బొమ్మలతో సమ్మక్క-సారక్క యూనివర్సిటీ లోగో
‘‘ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అన్యాయమైంది. ప్రయాణికుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ’’ అని అశ్విని వైష్ణవ్ అన్నారు. కొత్త వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తనకు బుక్ అయిన టికెట్ ప్రయాణ తేదీని మార్చుకోచ్చు. అయితే, మార్చుకోవాల్సిన తేదీలో సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యపడుతుంది. కొత్త టికెట్ ధర ఎక్కువైతే, ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికుడు భరించాల్సిందే.
ప్రస్తుత నిబంధన ప్రకారం, రైలు బయలుదేరడానికి 48 నుంచి 12 గంటల ముందు బుకింగ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ఛార్జీల నుంచి 25 తగ్గించి, మిగిలిన డబ్బు రీఫండ్ చేస్తారు. 12 గంటల నుంచి 4 గంటల ముందు ఛార్జ్ మరింత పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బు తిరిగి చెల్లించబడదు.