The coronal hole: సూర్యుడు ఎప్పుడూ లేనంతగా క్రియాశీలకంగా మారాడు. ఇటీవల కాలంలో సూర్యుడి ఉపరితలం గందరగోళంగా మారింది. సన్ స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, సౌర తుఫానుల తీవ్రత పెరిగింది. సూర్యుడు తన 11 ఏళ్ల సోలార్ సైకిల్ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్నాడు. ఈ సమయంలో సూర్యుడి ఉపరితలం మరింత క్రియాశీలకంగా మారుతుంది.
ప్రతీ సోలార్ సైకిల్‌కి తన అయస్కాంత క్షేత్రాన్ని మార్చుకుంటాడు. అంటే నార్త్ పోల్ సౌత్‌గా, సౌత్ పోల్ నార్త్‌గా మారుతుంది. ఈ సమయంలో సన్ స్పాట్స్ ఎక్కువగా ఏర్పడటంతో పాటు అయస్కాంత క్షేత్రం మరింత శక్తివంతంగా మారుతుంది. సూర్యుడిపై పేలుళ్లు ఏర్పడి పదార్థం అంతరిక్షంలోకి వెలువడుతుంది.
ఇదిలా ఉంటే కరోనల్ హోల్ సూర్యుడి ఉపరితలంపై గరిష్ట పరిమాణానికి చేరుకుంది. నిజానికి ఇది రంధ్రం కాదు, ప్రకాశవంతమైన సూర్యుడి వెలుగులో నల్లగా ఉండే ప్రాంతం రంధ్రంగా కనిపించడంతో ఈ పేరుతో పిలుస్తుంటారు. ప్రస్తుత ఏర్పడిన కరోనల్ హోల్ ఏకంగా 4,97,000 మైళ్ల అసాధారణ వెడల్పుకు విస్తరించింది. ఖగోళ పరిశోధకులు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇది మన సూర్యుడికి అభిముఖంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మన గ్రహం దిశగా అధిక వేగంతో సౌరగాలులు ప్రసారమవుతున్నాయి.
Read Also: Cricket: T10 చరిత్రలో రికార్డు.. 43 బంతుల్లో 193 పరుగులు చేసిన స్పెయిన్ బ్యాట్స్మెన్
డిసెంబర్ 2న సూర్యుడి భూమధ్య రేఖకు సమీపంలో ఈ కరోనల్ హోల్ ఉద్భవించింది. దాదాపుగా 5 లక్షల మైళ్ల దీని వెడల్పులో ఏకంగా 60 భూమి పరిణామం ఉన్న గ్రహాలను పెట్టొచ్చు. డిసెంబర్ 4 నుంచి భూమికి ఇది ఎదురుగా ఉంది. 11 ఏళ్ల సోలార్ సైకిల్ దశలో సూర్యుడు తన గరిష్ట ప్రక్రియకు చేరుకోవడాన్ని ‘సోలార్ మాగ్జిమమ్’ గా వ్యవహరిస్తారు. ఇది 2024 చివరిలో అంచానా వేయబడుతోంది.
సూర్యుడి నుంచి సెకనుకు 500-800 కిలోమీటర్ల మధ్య ప్రయాణించగలిగే సోలార్ విండ్స్ భూమిపై G2 భూ అయస్కాంత తుఫానును ప్రేరేపిస్తాయని, ఇది రేడియో బ్లాక్‌అవుట్‌లకు దారి తీసే అవకాశం ఉంది. అయితే భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం ఈ సౌర గాలులను, సౌర తుఫానులను అడ్డుకుంటుంది, భూమిపై ఉన్న జీవరాశికి ఎలాంటి అపాయం లేకుండా కాపాడుతుంది.
☀️ | Massive Sun Breach: A vast hole in the sun's atmosphere, almost 800,000 km long, is expelling solar wind towards Earth.
NASA's SDO documented this coronal hole, revealing missing hot gas. The solar wind, en route to Earth, is expected on Dec. 4th/5th.
Brace for Impact:… pic.twitter.com/pPFKzO7X2I
— Breaking News (@PlanetReportHQ) December 4, 2023