Kerala: కామాంధులు రెచ్చిపోతున్నారు. వావీవరసలు, చిన్నా పెద్దా అనే తేడాను మరించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటికి భయపడటం లేదు. దేశంలో ఎక్కడో చోట ప్రతీ రోజు అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా వరకు ఇలాంటి ఘటనలు తెలిసిన వారిని నుంచే ఎక్కువగా ఎదురవుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో మహిళల్ని మభ్యపెట్టి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
Read Also: Hydrogen Production: హైడ్రోజన్ ప్లాంట్ కోసం అంబానీ, అదానీతో పాటు రేసులో మరో 21 కంపెనీలు
తాజాగా కేరళలో ఓ వ్యక్తి 52 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. వివరాల్లోకి వెళ్తే.. అస్సాంకి చెందిన 32 ఏళ్ల వ్యక్తి ఫిర్దౌస్ కేరళలో పనిచేస్తున్నాడు. నిందితుడు ఫిర్దౌస్ కొచ్చిలోని రైల్వేస్టేషన్‌లో రోజూవారీ కూలీగా పనిచేస్తున్న మహిళని, మెట్రో స్టేషన్‌కి దారి చూపిస్తానని చెప్పి ప్రలోభపెట్టాడు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పొదల్లోకి తోసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలతో ఉన్న బాధితురాలిని గుర్తించి స్థానికులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నిందితుడి గురించిన వివరాలను బాధితురాలి నుంచి సేకరించారు. తక్కువ సమాచారం ఉన్నప్పటికీ.. నిందితుడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత ఫిర్దౌస్ కొచ్చిలోనే ఉన్నాడు. దీంతో పోలీసులకు చిక్కాడు. సొంత రాష్ట్రం అస్సాం అయినప్పటికీ మళయాళంలోని మంచి నైపుణ్యం ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి విచారణ జరుపుతున్నారు.