Hardik Pandya: ప్రస్తుతం భారత్-మాల్దీవుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మనదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవులను సందర్శించారు. అక్కడ ఉన్న సుందరమైన బీచుల్లో ఆయన పర్యటించిన ఫోటోలను ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు. లక్షదీవుల్లో పర్యాటకాన్ని ప్రమోట్ చేయడమే కాకుండా అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు. అయితే దీనిపై మాల్దీవుల్లోని పలువురు నేతలు మోడీని, భారతీయుల్ని ఉద్దేశిస్తూ అవమానకరమైన పోస్టుల్ని పెట్టారు. ఇది వివాదానికి కారణమైంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్ వంటి వారు ప్రధాని మోడీకి మద్దతు తెలిపారు. లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రమోట్ చేసేలా పిలుపునిచ్చారు.
Read Also: Breaking News: మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం
ఇదిలా ఉంటే తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ వివాదంపై స్పందించారు. భారత్ గురించి వారు ఏం మాట్లాడుతున్నారో చూస్తే బాధగా ఉంది. అందమైన సమద్ర వాతావరణానికి, అందమైన బీచులకు లక్షద్వీప్ పర్‌ఫెక్ట్ గేట్ వే అంటూ తన తదుపరి హాలిడే కోసం లక్షదీవుల్ని సందర్శిస్తానని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్రమోడీ లక్షదీవుల్ని సందర్శించడంపై అక్కడి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మరియం షియునా పీఎం మోడీని ఉద్దేశిస్తూ విదూషకుడు, తోలుబొమ్మ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈమె చేసిన సోషల్ మీడియా పోస్టుపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో ఆమె ఈ పోస్టును డిలీల్ చేసింది. ఆ దేశ ఎంపీ జహీద్ రమీజ్ తన అక్కను వెళ్లగక్కాడు. పర్యాటకంలో తమతో భారత్ పోటీ పడాలన్న ఆలోచన భ్రమే అని, మా దేశంలో అందించే సర్వీస్ ఎలా అందించగలరు..? పరిశుభ్రంగా ఎలాం ఉంచగలరు..? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ‘బాయ్‌కాట్ మాల్దీవిస్’ హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. పలువురు ఈ దేశ టూర్‌ని రద్దు చేసుకుంటున్నారు.
Extremely sad to see what’s being said about India. With its gorgeous marine life, beautiful beaches, Lakshadweep is the perfect get away spot and surely a must visit for me for my next holiday 🫶 #ExploreIncredibleIndia pic.twitter.com/UA7suQArLB
— hardik pandya (@hardikpandya7) January 7, 2024