Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..
- రణరంగంగా పాకిస్తాన్..
- తెహ్రీక్ ఇ లబ్బాయిక్ హింసాత్మక నిరసనలు..
- పాక్ పోలీసుల కాల్పుల్లో 11 మంది మృతి..
- ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా తీవ్రమవుతున్న ఆందోళనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ తగలబడిపోతోంది. ఇస్లామిక అతివాద సంస్థ ‘‘తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP)’’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో తీవ్ర హింస చోటు చేసుకుంది. పోలీసులు, ప్రదర్శనకారులకు మధ్య తీవ్ర యుద్ధం నెలకొంది. రాజధాని ఇస్లామాబాద్ వైపు వెళ్లేందుకు యత్నించిన నిరసనకారుల్ని పాక్ భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. దీంతో లాహోర్ నగరం రణరంగంగా మారింది. ఇజ్రాయిల్‌కు మద్దతు నిలిచినందుకు వీరంతా, అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
Read Also: Belly Fat Reduction: త్వరగా బొజ్జ తగ్గాలా..? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి..
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
- US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
ఈ నిరసనల్ని అణిచేందుకు ప్రయత్నించిన పంజాబ్ పోలీసుల్ని టీఎల్‌పీ ‘‘ఇజ్రాయిల్ గుండాలు’’గా పిలిచింది. దీంతో పంజాబ్ పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది నిరసనకారులు మరణించారని, 50 మందికి పైగా గాయపడ్డారని టీఎల్‌పీ చెప్పంది. గాజాలో ఇజ్రాయిల్ దాడులకు వ్యతిరేకంగా గురువారం నిరసనలు ప్రారంభమయ్యాయి. పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్, లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్‌లోని ఆజాదీ చౌక్ సమీపంలో ఘర్షణలు తీవ్రమయ్యాయి. పోలీసులు వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు, ఇస్లామాబాద్ వైపు వెళ్తున్న నిరసనకారుల్ని అడ్డుకునేందుకు రోడ్లపై కంటైనర్లను మోహరించారు.
Latest situation of TLP protest in Shadara Lahore.#TLPprotest #Lahore pic.twitter.com/SJP38ryVvv
— Fakhar Yousafzai (@fakharzai7) October 11, 2025
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!