Ram Bhajan: యావత్ దేశం రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురుచూస్తోంది. జనవరి 22న ఈ మహాత్తర ఘట్టం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. రామ మందిర వేడుకకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది దేశవ్యాప్తంగా పండగ వాతావరణ నెలకొంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ ముస్లిం యువతి పాడిన ‘రామ్ భజన’ వీడియో వైరల్‌గా మారింది. జమ్మూ కాశ్మీర్ లోని ఉరీకి చెందిన సయ్యద్ బటూల్ జెహ్రా(19) పహారీ భాషలో రామభజన ఆలపించడం నెటిజన్ల మనసును గెలుచుకుంటోంది. సయ్యద్ కమ్యూనిటికీ చెంది జెహ్రా ముస్లిం అయినప్పటికీ.. రామ్ భజనను శ్రావ్యంగా పాడటాన్ని అంతా ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సింగర్ జుబిన్ నైటియాల్ స్పూర్తితో తాను రామ భజన ఆలపించినట్లు జెహ్రా తెలిపారు.
ఇటీవల తాను పాడిన రామ్ భజన్ వైరల్ అయిందని.. జెహ్రా కుప్వారాలో మీడియాతో అన్నారు. ఆమె సోమవారం పోలీసులు నిర్వహించిన ప్రజా దర్బార్‌లో డీజీపీ ఆర్ఆర్ స్వైన్‌ని కలిసేందుకు వచ్చారు. హిందీలో గాయకుడు జుబిన్ నౌటియాల్ పాడిన రామ్ ‘భజన్’ పహారీ భాషలో రూపొందించడానికి తనను ప్రేరేపించిందని ఆమె చెప్పింది. ‘‘ నేను యూట్యూబ్‌లో జుబిన్ నౌటియాల్ పాడిన హిందీ భజన చూశాను. మొదటగా హిందీలో పాడాను, నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత నా పహారీ భాషలో పాడాలని అనుకున్నాను. హిందీ నుంచి పహారీలోకి అనువదించాను.’’ అని జెహ్రా చెప్పుకొచ్చారు. ముస్లిం అయినప్పటికీ ‘భజన్’ పాడడంలో తప్పు కనిపించలేదని ఆమె చెప్పారు.
మా లెఫ్టినెంట్ గవర్నర్ హిందూ కానీ, అభివృద్ధి పనుల్లో మతం ఆధారంగా వివక్ష చూపించరు. ప్రవక్త అనుచరులు తాము నివసించే దేశాన్ని ప్రేమిస్తారని మా ఇమామ్ హుస్సేన్ మాకు నేర్పించారని, దేశాన్ని ప్రేమించడం, విశ్వాసపాత్రులుగా ఉండటం ఇస్లాం నేర్పిందని చెప్పారు. హిందువులు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులు అంతా సోదరులని నేను నమ్ముతానని, అందరికి సహకరించడం తమ కర్తవ్యమని ఆమె అన్నారు.
#WATCH | Uri, J&K: On singing Ram bhajan in Pahari language, Batool Zehra says, "I heard a song by Jubin Nautiyal and I liked it very much. I thought that if it can be in Hindi, why can it not be in Pahari. I wrote it in Pahari and sang it. I recorded it and showed it to my sir.… https://t.co/xiIE8ojxgw pic.twitter.com/5NoDaRZqsu
— ANI (@ANI) January 15, 2024