US Dreams: అమెరికాలో కంపెనీ పెట్టలేకపోయానని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Dreams: యువతలో అమెరికా కలలు పెరుగుతున్నాయి. డాలర్ డ్రీమ్స్‌తో అమెరికా బాట పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. అయితే, గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు అమెరికాలో కనిపించడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ మహమ్మారి ఇలా పలు సమస్యలతో ఆర్థిక రంగం కుదేలవుతోంది. ఇలాంటి సందర్భాల్లో అమెరికాకు వెళ్లి ఉద్యోగం సంపాదించుకుని, అక్కడే స్థిర పడాలనే కోరిక కాస్త కష్టం అవుతోంది. అయినా కూడా తమ దేశంలో చాలా మంది అక్కడికి వెళ్లేందుకే సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలతో ఇప్పటికే ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయి.
Also Read
- Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
- Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం... అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
- Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
ఇదిలా ఉంటే, అమెరికాలో సొంతగా కంపెనీ పెట్టలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమీన్పూర్ పరిధిలో చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూర్ మండలం ముత్యాల పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాశీ విశ్వనాథ్(38) పటాన్చెరు పరిధిలోని అమీన్పూర్ దుర్గా హోమ్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.
అమీన్పూర్ ఎస్ఐ ఈవీ రమణ వివరాల ప్రకారం..మాదాపూర్‌లో ఎడాట్ ప్రైమ్ సాఫ్ట్వేర్ కంపెనీని నెలకొల్పిన విశ్వనాథ్, ఆరు నెలల క్రితం అమెరికాలో మరో కంపెనీ పెట్టడానికి వెళ్లాడు. అయితే, అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ఊచలకు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!