Mahindra Thar Earth edition: ఇండియాలో ఆఫ్ రోడ్ వాహనాల్లో మహీంద్రా థార్‌కి ఉన్న క్రేజే వేరు. వేరే కార్ మేకర్ కంపెనీల నుంచి పలు రకాల ఆఫ్ రోడర్లు వచ్చినప్పటికీ థార్‌కి ఉన్న ఆదరణ మాత్రం నానాటికి పెరుగుతోంది. తాజాగా థార్ కొత్త అవతార్‌లో వస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్‌ని లాంచ్ చేసింది. రూ. 15.40 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధర వద్ద దీనిని విడుదల చేశారు. టాప్-స్పెక్ LX హార్డ్ టాప్ 4×4 వేరియంట్‌లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఛాయిస్‌లలో అందించబడుతోంది.
థార్ ఎర్త్ ఎడిషన్ 2.0 లీటర్ mStallion 150 TGDi పెట్రోల్ ఇంజన్ (150bhp/320Nm) మరియు 2.2-లీటర్ mHawk 130 CRDe డీజిల్ ఇంజన్ (130bhp/300Nm) ఉన్నాయి. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ఛాయిస్‌లను కలిగి ఉంది. థార్ ఎర్త్ ఎడిషన్ పూర్తిగా ఫోర్ వీల్ డ్రైవ్(4WD)గా వస్తోంది.
ధర వివరాలు(ఎక్స్-షోరూం):
వేరియంట్- ధర
పెట్రోల్(MT) — రూ.15.40 లక్షలు
పెట్రోల్(AT) — రూ.16.99 లక్షలు
డిజిల్(MT) — రూ. 16.15 లక్షలు
డిజిల్(AT)– రూ. 17.60 లక్షలు