Lok Sabha Elections 2024: ఏడు దశాబ్ధాల ఎన్నికల చరిత్రలో 14 నుంచి 6కి తగ్గిన జాతీయ పార్టీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. తమ అభ్యర్థులను వరసగా ప్రకటిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏడు దశాబ్ధాల భారత ఎన్నికల చరిత్రలో జాతీయ పార్టీల సంఖ్య తొలిసారిగా 14 నుంచి 6కి పడిపోయింది. 1951లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు పోటీ చేయగా.. ప్రస్తుతం దేశంలో 2500కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి.
ప్రస్తుతం జరగబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో 6 జాతీయ పార్టీలు పోటీ చేయనున్నాయి. పలు పార్టీలు ఇతర పార్టీల్లో విలీనం కావడంతో అవి ప్రస్తుతం ఉనికిలో లేకుండా పోయాయి. మొదటి ఎన్నికల్లో 53 రాజకీయ పార్టీలు ఉంటే వీటిలో 14 జాతీయ పార్టీలుగా పరిగణించబడ్డాయి. మిగిలినవి రాష్ట్ర పార్టీలుగా ఉన్నాయి. భారత ఎన్నికల చరిత్రను ‘లీప్ ఆఫ్ ఫెయిత్’’ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన డాక్యమెంట్‌లో 1953 ఎన్నికలకు ముందు 29 రాజకీయ పార్టీలు జాతీయ హోదాను డిమాండ్ చేశాయి. వీటిలో 14 పార్టీలకు మాత్రమే జాతీయ హోదా ఇవ్వబడింది. చివరకు వీటిలో 4 మాత్రమే జాతీయ హోదాను నిలుపుకున్నాయి.
Also Read
1953 నాటికి 4 జాతీయ పార్టీలు కాంగ్రెస్, ప్రజా సోషలిస్ట్ పార్టీ(సోషలిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీల విలీనంతో ఏర్పాటు), సీపీఐ, జనసంఘ్ మాత్రమే మిగిలాయి. జాతీయ హోదా కోల్పోయిన పార్టీల్లో అఖిల భారతీయ హిందూ మహాసభ (HMS), ఆల్ ఇండియా భారతీయ జన్ సంఘ్ (BJS), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (SCF), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (మార్క్సిస్ట్ గ్రూప్) (FBL-MG) మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (రుయికర్ గ్రూప్) (FBL-RG), కృషికర్ లోక్ పార్టీ (KLP), బోల్షెవిక్ పార్టీ ఆఫ్ ఇండియా (BPI), మరియు రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (RCPI) వంటి పార్టీలు ఉన్నాయి.
Read Also: Nellore Crime: ఘరానా దొంగలు.. కొట్టేసిన బంగారాన్ని ఏం చేశారో తెలిస్తే షాకవుతారు?
సొషలిస్ట్ పార్టీ, కిసాన్ మజ్దూర్ పార్టీలు తొలి ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. ఆ తర్వాత విలీనమై ప్రజా సోషలిస్ట్ పార్టీగా మారింది. 1957 నాటికి రెండో ఎన్నికల సమయంలో 15 రాజకీయ పార్టీలు మిగిలిలాయి. అయితే, 1962 నాటికి 27 పార్టీలు పోటీలో నిలబడ్డాయి. సామ్యవాద (SOC) మరియు స్వతంత్ర (SWA) పార్టీలు ఎన్నికలలో పోటీ చేయడంతో జాతీయ పార్టీల సంఖ్య ఆరుకు పెరిగింది.
1951 ఎన్నికల తర్వాత రెండు లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడింది. అయితే, 1964లో, పార్టీలోని సోవియట్ మరియు చైనీస్ కమ్యూనిస్ట్ వర్గాలు చీలిపోయి, సిపిఐ (మార్క్సిస్ట్) ఏర్పడింది. ఆ తర్వాత, కొత్తగా ఏర్పడిన సీపీఐ(ఎం) దేశ సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ కంటే ఎక్కువ ఓట్లను పొందడం కొనసాగించింది. 1977 ఎమర్జెన్సీ తర్వాత దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిసి జనతా పార్టీని ఏర్పాటు చేశాయి. ఈ జనతా పార్టీ నుంచే బీజేపీ, సమాజ్ వాదీ పార్టీలు వెలుగులోకి వచ్చాయి.
1992 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల సంఖ్య 7కి చేరింది. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్, జనతా పార్టీ, లోక్‌దళ్‌తో బీజేపీ జాతీయ హోదాను పొందింది. 1996 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో 209 రాజకీయా పార్టీలు పోటీలో ఉన్నాయి. 1998 ఎన్నికల్లో జాతీయ పార్టీలు-కాంగ్రెస్, BJP, BSP, జనతాదళ్, CPI, CPM మరియు సమతా పార్టీలతో కలిపి 176 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. 1999లో ఏడు జాతీయ పార్టీలతో సహా 160 పార్టీలో ఎన్నికల బరిలో నిలిచాయి. జాతీయ పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జనతాదళ్ (సెక్యులర్) మరియు జనతాదళ్ (యునైటెడ్) ఉన్నాయి. 2014లో 464 పార్టీలు పోటీలో నిలబడ్డాయి. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ పోటీలో ఉన్నాయి.
2016 నాటికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) జాతీయ పార్టీ హోదాకు ఎదిగింది. 2019లో 7 జాతీయ పార్టీలు-BJP, కాంగ్రెస్, BSP, CPI, CPI (M), NCP, టీఎంసీతో సహా 674 పార్టీలు పోటీలో ఉన్నాయి. ఆ తర్వాత టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ తమ జాతీయ హోదాను కోల్పోయాయి. నిబంధనల ప్రకారం ఓ పార్టీ జాతీయ పార్టీ హోదా పొందాలంటే కనీసం మూడు రాష్ట్రాల్లో 2 శాతం సీట్లు సాధించాలి, కనీసం 6 శాతం ఓట్లు పొందాలి, లోక్ సభ స్థానాలు లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపార్టీగా గుర్తింపు పొందాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ పార్టీగా ఎదిగింది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. వీటిలో బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?