Kirti Chakra: కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కి మరణానంతరం ‘కీర్తిచక్ర’
- కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కి మరణానంతరం ‘కీర్తిచక్ర’..
- గతేడాది అనంత్‌నాగ్ ఎన్కౌంటర్లో వీరమరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kirti Chakra: గతేడాది సెప్టెంబర్ నెలలో జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీర మరణ పొందిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్‌కి ఈ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా మరణానంతరం ‘‘కీర్తిచక్ర’’ అవార్డును కేంద్ర ప్రకటించింది. మన్‌ప్రీత్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు జవాన్లు మొత్తం ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. అవార్డ్ అందుకున్న వారిలో రైఫిల్‌మెన్ రవి కుమార్, మేజర్ ఎం నాయుడు ఉన్నారు.
Read Also: Mamata Banerjee: బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
Also Read
- PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
- Ananya Agarwal: 21 ఏళ్ల వయసులోనే బిజినెస్.. కేవలం 50 రోజుల్లోనే రూ. 15 లక్షల రెవెన్యూ రాబట్టిన కాలేజీ స్టూడెంట్
- Ex-Girlfriend Case: మాజీ ప్రేయసి వివరాల కోసం యువకుడి ప్రయత్నం.. 97 RTI దరఖాస్తులు, 1,887 ప్రశ్నలు! షాకైన కమిషన్
- Wakefit Sleep Internship: రెండు నెలల స్లీప్ ఛాలెంజ్.. హాయిగా నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకున్న యువతి
కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. అనంత్‌నాగ్ జిల్లాలోని కోకెర్నాగ్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో 19వ రాష్ట్రీయ రైఫిల్స్ (RR)కు చెందిన కల్నల్ సింగ్, మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కాశ్మీర్ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమాయున్ ముజామిల్ భట్ ప్రాణాలు కోల్పోయారు.
ఆర్మీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఉగ్రవాదులు నక్కిన చొట ఆపరేషన్ బృందానికి మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహించారు. ఉగ్రవాదులు దాక్కున్న భవనంపైకి ఎక్కుతున్న సమయంలో లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. కల్నల్ సింగ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య జగ్మీత్ కౌర్, పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరికి ఆరు మరియు రెండు సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నారు.
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!