Enforcement Directorate: దేశవ్యాప్తంగా అవినీతి, మనీలాండరింగ్ కేసులను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నూతన డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి రాహుల్ నవీన్‌ని ఈడీ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది.
ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు చెందిన 1993-బ్యాచ్ అధికారి అయిన నవీన్, సెప్టెంబర్ 15, 2023 వరకు ఈడీ డైరెక్టర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం పూర్తికావడంతో ఆయన స్థానంలో ఈడీ ప్రత్యేక డైరెక్టర్ స్థానంలోకి అడుగుపెట్టారు. ఈడీ ఛీప్ అయ్యేముందు నవీన్, సంజయ్ మిశ్రా మార్గదర్శకత్వంలో పనిచేశారు. ఈడీ, సీబీఐ చీఫ్‌ల పదవీ కాలాన్ని 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచుతూ గతేడాది ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేసిన తర్వాత ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం దేశంలోని 100 మందికి పైగా రాజకీయ నేతలను ED విచారిస్తోంది, వీరిలో దాదాపు 95 శాతం మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు.
Read Also: Mamata Banerjee: బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
నవీన్ ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి, మెల్‌బోర్న్‌లోని స్విన్బర్న్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలీజ నుంచి ఎంబీఏ చదివారు. అంతర్జాతీయ పన్నుల విషయాల్లో కొత్త ఈడీ చీఫ్ నిష్ణాతుడు. 30 ఏళ్లుగా ఐటీ విభాగంలో పనిచేస్తున్నారు. 2004-28 వరకు అంతర్జాతీయ పన్నుల విభాగంలో ఆయన పనిచేసిన సమయంలో, వోడాఫోన్ కేసుతో సహా అనేక ఆఫ్‌షోర్ లావాదేవీలపై లేవనెత్తింది. ఈ ఏడాది సందేశ్‌ఖాళీ ఘటనలో ఈయన టీం భయపడకుండా పనిచేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA)లోని పౌర నిబంధనలతో పాటు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) మరియు ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం (FEOA) అనే రెండు క్రిమినల్ చట్టాల కింద ED ఆర్థిక నేరాలను పరిశోధిస్తుంది.