Mamata Banerjee: సీబీఐకి మమతా అల్టిమేటం.. ఆదివారంలోగా వైద్యురాలికి న్యాయం జరగాలి..
- వైద్యురాలి అత్యాచార ఘటనపై సీబీఐకి మమతా అల్టిమేటం..
- ఆదివారంలోగా బాధితురాలికి న్యాయం చేయాలి..
- ఘటనపై శనివారం భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన టీఎంసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై నిన్న కలకత్తా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో స్థానిక పోలీసులు, ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ కేసులో సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోస్టుమార్టం నివేదికలో మాత్రం బాధితురాలి శరీరంలో గణనీయ స్థాయిలో 150 మిల్లిగ్రాముల వీర్యం దొరకడంతో ఈ కేసులో సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వినిపిస్తున్నాయి.
Read Also: Mamata Banerjee: బెంగాల్‌ని బంగ్లాదేశ్‌లా చేయాలనుకుంటున్నారు.. వైద్యురాలి అత్యాచార కేసుపై మమతా..
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
ఇదిలా ఉంటే, ఈ కేసులో పొలిటికల్ దుమారం చెలరేగింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై బీజేపీ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే, బుధవారం రోజు ఈ కేసుపై సీఎం మమతా స్పందిస్తూ.. బీజేపీ, సీపీఎంలో వైద్యురాలి ఘటనలో చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయంటూ విమర్శించారు. కోల్‌కతా పోలీసుల నుంచి విచారణ చేపట్టిన సీబీఐ అధికారులకు ఆమె అల్టిమేటం జారీ చేశారు. వచ్చే ఆదివారం లోగా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఆగస్టు 16న కోల్‌కతాలోని మౌలాలి నుంచి ధర్మతాలా వరకు బాధితురాలికి మద్దతుగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నాను. వచ్చే ఆదివారం లోగా సీబీఐ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె అన్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిడిచే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల యువతిపై దారుణంగా అత్యాచారం హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెను నిందితుడు పాశవికంగా హత్యాచారం చేశాడు. శుక్రవారం ఉదయం కాలేజీ సెమినార్ గదిలో బాధితురాలి మృతదేహం నగ్నంగా పడి ఉంది. ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం కావడంతో పాటు పెదవులు, గొంతు, ముఖంపై గాయాలు ఉన్నట్లు తేలింది. మెడ ఎముక విరిగినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!