Jagdeep Dhankhar: రాజ్యాంగ పదవిలో ఉండీ ఆర్థిక వ్యవస్థ నాశనానికి ప్రయత్నం.. రాహుల్ గాంధీని ఉద్దేశించేనా..?
- రాజ్యాంగ పదవిలో ఉండీ ఆర్థిక వ్యవస్థ నాశనానికి ప్రయత్నం..
- హిండెన్‌బర్గ్ నివేదిక గురించి ఉప రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు..
- పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagdeep Dhankhar: భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు ‘‘రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి’’ ప్రయత్నిస్తున్నారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్‌ని లక్ష్యంగా చేసుకుని ఇటీవల హిండెన్‌బర్గ్ ఓ రిపోర్టుని విడుదల చేసింది. ఆమెకు అదానీ గ్రూపులో షేర్స్ ఉన్నాయని ఆరోపించింది.అయితే, ఈ ఆరోపణల్ని సదరు కంపెనీ తిప్పికొట్టింది. బీజేపీ నేతలు కూడా ఈ రిపోర్టును కొట్టిపారేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు కొందరు విదేశీ శక్తులతో చేతులు కలిపి పనిచేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
Read Also: Ricky Ponting: కోహ్లీ కాదు.. సచిన్ ప్రపంచ రికార్డు అతడే బద్దలు కొడతాడు: పాంటింగ్
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
శుక్రవారం నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్‌ఎల్‌యు)లో న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ధన్‌ఖర్ మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ఒక కథనాన్ని తీసుకువచ్చారని దీని గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని అన్నారు. “గత వారంలో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బాగా ప్రచారం పొందిన మీడియాలో ప్రకటించినప్పుడు నేను చాలా ఆందోళన చెందాను. మన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసే కథనానికి మద్దతు ఇస్తూ, సుప్రీంకోర్టు సుమోటోగా విచారించాలని అభ్యర్థించిన సమయంలో నేను చాలా ఆందోళన చెందాను’’ అని ధన్‌ఖర్ అన్నారు.
దేశ శ్రేయస్సు కంటే పక్షపాతం మరియు స్వప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే శక్తులను తుదముట్టించాలని ఆయన యువతను కోరారు. మన దేశం కంటే పక్షపాత్రం, స్వప్రయోజనాలు ఎక్కువగా భావించే శక్తుల్ని తిప్పికొట్టాలని సూచించారు. గతంలో హిండెన్ బర్గ్ నివేదికను ప్రస్తావిస్తూ ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని రాహుల్ గాంధీ కోరాడు. రాహుల్ గాంధీ పేరుని తీయకుండా ధన్‌ఖర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్‌డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!