Monkey Pox: స్వీడన్‌లో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు..
- స్వీడన్‌లో తొలి మంకీపాక్స్ వైరస్ కేసు..
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన కొద్దిసేపటికే తొలి కేసు..
- ఇప్పటికే కాంగోలో ఉప్పెనలా వైరస్ వ్యాప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey Pox: ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలో ఉప్పెనలా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిని ‘‘గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ’’గా ప్రకటించింది. రెండేళ్లలో రెండోసారి అత్యవసర పరిస్థితిని గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఆఫ్రికాలోని డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఇప్పటికే ఈ వ్యాప్తి ఉప్పెనలా విరుచుకుపడుతోంది. 548 మంది ఈ వైరస్ వల్ల ఆ దేశంలో మరణించారు. 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో ఇతర దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది.
Read Also: UP video: యూపీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి.. నిందితుడి కాలుకు బుల్లెట్
Also Read
ఇదిలా ఉంటే, తాజాగా క్లోజ్ కాంటాక్ట్ ద్వారా స్వీడన్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. స్వీడన్‌లో క్లాడ్-1 అనే అత్యంత తీవ్రమైన మంకీపాక్స్ కేసు ధృవీకరించినట్లు ఆరోగ్య సామాజిక వ్యవహారాల మంత్రి జాకోబ్ ఫోర్స్‌మెడ్ వార్తా సమావేశంలో చెప్పారు.
రెండేళ్ల క్రితం యూరప్ అంతటా ఈ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా స్వలింగ సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి 2022లో 100కు పైగా దేశాల్లో 70,000 కన్నా ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపించింది. 2022 మే నెలలో బ్రిటన్ లో మొదటిసారిగా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు యూరప్ లోని చాలా దేశాల్లో వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. బ్రిటన్ తో పాటు బెల్జియం, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ప్రభావితం అయ్యాయి. ఇదిలా ఉంటే భారత్ లో కూడా కొన్ని కేసులు నమోదు అయ్యాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?