Rahul Gandhi: దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి.. లాట్రల్ ఎంట్రీపై రాహుల్ ఫైర్..
- లాటరల్ ఎంట్రీ విధానంపై ముదురుతున్న వివాదం..
- బీజేపీ వర్సెస్ ఇండియా కూటమి..
- దళితులు..ఆదివాసీలు.. ఓబీసీలకు అన్యాయం..
- ఐఏఎస్‌ల ప్రైవేటీకరణ అని రాహుల్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.
45 మంది జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను లాటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో స్పెషలిస్టు(ప్రైవేట్ రంగానికి చెందిన వారితో సహా) నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడింది. భారతదేశ పరిపాలన యంత్రాంగం, సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను పెంచేందుకు నిపుణుల అవసరాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ హయాంలో లాటరల్ ఎంట్రీ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు.
Also Read
- CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా ఆస్పత్రిపై దాడి తృణమూల్ గుండాల పనే.. బాధితురాలి న్యాయవాది..
2018లో, జాయింట్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల వంటి సీనియర్ స్థానాలకు ఖాళీలను ప్రకటించడం ద్వారా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ఉన్నతస్థాయి పొజిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని బేరీజు వేసుకుని ఈ కీలకమైన పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.
అయితే, ప్రధాని నరేంద్రమోడీ సాంప్రదాయక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్ని భర్తీ చేయకుండా, ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను నియమిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పాలన నిర్మాణం, సామాజిక న్యాయం రెండింటిని దెబ్బతీసి ఈ ‘‘దేశ వ్యతిరేక చర్య’’ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు. ఈ పద్ధతి ‘‘ఐఏఎస్‌ల ప్రైవేటీకరణ’’ అని, రిజర్వేషన్లను అంతం చేసే ప్రక్రియ అని ఆరోపించారు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?