Donald Trump: “భారత్‌కి అనుకూలం”.. అమెరికా హిందూ సంస్థ మద్దతు డొనాల్డ్ ట్రంప్‌కే..
- డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ప్రకటించిన హిందూ సంస్థ..
- కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌కి మద్దతుగా ప్రచారం..
- భారత్‌కి ట్రంప్ చాలా అనుకూలం..
- కమలా హారిస్ భారత్-అమెరికా బంధాన్ని అస్థిరపరుస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ‘‘హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్’’ అనే హిందూ సంస్థ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతు ప్రకటించింది. ఎన్నికల్లో కీలక రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కొరోలినాలో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గురువారం సంస్థ చైర్మన్, వ్యవస్థాపకుడు ఉత్సవ్ సందుజా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కమలా హారిస్ ‘‘భారత్-అమెరికా సంబంధాలను చాలా అస్థిరపరుస్తారు’’అని పేర్కొన్నారు.
‘‘కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలైతే, ఆమె తన టీంలో కొంతమంది ఉదారవాద తోడేళ్లను ఉంచవచ్చు. వీరు ఆసియన్-అమెరికన్ ఓటర్లపై ప్రభావం చూపించే విధంగా సుప్రీంకోర్టుని తప్పుదారి పట్టించొచ్చు’’ అని అతను అన్నాడు. బైడెన్-హారిస్ పాలన సరిహద్దును సురక్షితంగా ఉంచలేదని చెప్పారు. ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న కమలా హారిస్ యూఎస్‌లోకి అక్రమ వలసల్ని అడ్డుకోలేదని ఆయన చెప్పారు.
Also Read
- Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
Read Also: RG Kar Hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిపై మరో ఆరోపణ..వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?
అక్రమ వలసదారుల కారణంగా అనేక నేరాలు పెరిగాయని, మాదకద్యవ్యాల అక్రమ రవాణా పెరిగిందని, ఇది మైనారిటీ వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా అనేక ఆసియా-అమెరికన్ వ్యాపార యజమానులను ప్రభావితం చేస్తుందని ఆయన పేర్కొన్నాడు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత మెరిట్ ఆధారంగా మార్చడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను సందుజా ప్రశంసించారు. భారత రక్షణ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే విషయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చాలా కృషి చేశారని ప్రశంసించారు.
ట్రంప్ ‘‘భారత్‌కి చాలా అనుకూలం’’ ప్రధాని మోడీతో అద్భుతమైన సంబంధాలను పెంపొందించుకోగలిగారని, చైనాపై భారత్‌ని ఢీకొనేందుకు వీలుగా అనేక రక్షణ ప్రాజెక్టులకు సహకరించాలని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం, ప్రజల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన హారిస్ కాకుండా, ట్రంప్ దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదని చెప్పారు. జార్జియా, నార్త్ కరోలి, పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్, అరిజోనా, నెవడా వంటి కీలక రాష్ట్రాల్లో హిందువులు హరిస్‌కి వ్యతిరేకంగా ఉండేందుకు హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రపంచ హిందూ సమాజం ఆందోళన చెందుతోందని సందుజా అన్నారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!