విదేశాంగ మంత్రి జైశంకర్ డిన్నర్ చేయాల్సి వస్తే జార్జ్ సోరోస్, నార్త్ కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లలో ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నిస్తే, జైశంకర్ చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విదేశాంగ మంత్రి రాపిడ్ ఫైర్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
మీరు డిన్నర్ చేయాలనుకుంటే కిమ్ జోంగ్ ఉన్ లేదా జార్జ్ సోరోస్‌లలో ఎవరిని ఎంచుకుంటారని ప్రసెంటర్ ప్రశ్నించారు. ఇందుకు జైశంకర్ స్పందిస్తూ.. ‘‘ఇది నవరాత్రి అని నేను అనుకుంటున్నాను. నేను ఉపవాసం ఉన్నాను’’ అని బదులిచ్చారు. దీంతో ప్రేక్షకులు, యాంకర్స్ ఒక్కసారిగా నవ్వారు.
జార్జ్ సోరోస్ అనే అమెరికా వ్యక్తి యాంటీ ఇండియా, యాంటీ హిందూ భావనలు ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. భారతదేశంలో దేశ వ్యతిరేక ఉద్యమాలకు, అంశాలకు నిధులు సమకూరస్తున్నాడనే అభియోగాలు ఉన్నాయి. భారత్‌లో వెస్ట్రన్ దేశాల ఎజెండాని అమలు చేయాలని భావిస్తున్నాడని, ముఖ్యంగా దేశంలోని ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని దించాలని ప్రయత్నిస్తున్నాడని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నార్త్ కొరియా అధినేతగా అందరికి తెలుసు.
గతంలో రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని వెస్ట్రన్ మీడియా ప్రశ్నించిన సమయంలో జైశంకర్ ఇచ్చిన సమాధానం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా, వెస్ట్రన్ కంట్రీలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయినా కూడా భారత్ రష్యా నుంచి ఆయిల్స్ కొంటుంది. జైశంకర్ మాట్లాడుతూ..‘‘గణాంకాలను చూస్తే యూరప్ మధ్యాహ్నం వరకు కొనుగోలు చేసే రష్యా ఆయిల్స్ కన్నా, భారత్ కొనుగోలు చేసేది తక్కువే’’ అని ముఖంపై కొట్టినట్లు సమాధానం ఇచ్చారు.
-Anchor: Choose one person you wish to have dinner with – Kim Jong Un or George Soros?"
-Dr. Jaishankar: I think this is Navratri, and I'm fasting 😭🤣 pic.twitter.com/ozGkuS4Itr
— Mr Sinha (@MrSinha_) October 5, 2024