Delhi pollution: ఢిల్లీలో కాలుష్యానికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు అధిక సంఖ్యలో రావడమే అని ఢిల్లీ సీఎం అతిషి ఆదివారం అన్నారు. నగరంలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యానికి ఇతర రాష్ట్రాల బస్సులే కారణమవుతున్నాయని, బస్ డిపోల్లో కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె చెప్పారు.
Read Also: Unstoppable 4 -NBK: అన్‌స్టాపబుల్ సీజన్ ఫోర్‌లో ఫస్ట్ గెస్ట్‌గా సీఎం చంద్రబాబు..
పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌తో కలిసి ఆనంద్ విహార్ బస్స డిపోలోని కాలుష్య నియంత్రణ చర్యల్ని పరిశీలించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో ఉన్న ఆనంద్ విహార్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) స్థాయి అధికంగా ఉండే హాట్ స్పాట్‌గా మారిందని ఆమె అన్నారు. ఢిల్లీ వెలుపల నుంచి ముఖ్యంగా యూపీ నుంచి ప పెద్ద సంఖ్యలో బస్సులు వస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి సమీపంలో కౌశాంబి డిపో కూడా ఉందన్నారు. ఢిల్లీలో సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బస్సుల్ని నడుపుతున్నప్పుడు, యూపీ నుంచి డీజిల్ బస్సులు వస్తున్నాయని అన్నారు.
ఎన్‌సిఆర్‌టిసి మరియు ఆర్‌ఆర్‌టిఎస్ నిర్మాణాలు కూడా ఈ ప్రాంతంలో కాలుష్యానికి దోహదం చేయాయని, సమస్యని తగ్గించడానికి ప్రభుత్వం 99 బృందాలను, 315 స్మోక్ గన్స్‌ని అందుబాటులో ఉంచిందని, అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని చెప్పారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు శుద్ధి చేయని వ్యర్థాలను నదిలోకి వదులుతున్నారని, యమునా నదిలో కాలుష్య సమస్యను అతిషి ప్రస్తావించారు.