India Canada: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకి సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు భారతదేశం గురించి రహస్య సమాచారాన్ని, కెనడాలో భారత జోక్యంపై అమెరికా వార్తాపత్రికతో పంచుకున్నారు. కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్ అమెరికా మీడియాకు తెలియజేసినట్లు కెనడా మంగళవారం నివేదించింది. కెనడియన్ ఫెడరల్ పోలీసులు ఆరోపించిన కొన్ని రోజులుకు ముందే సమాచారాన్ని అందించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Minister Sridhar Babu: ఎవ్వరిని వదిలి పెట్టం.. కాంగ్రెస్ నేత హత్యపై మంత్రి సీరియస్
ముఖ్యం గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కెనడాలోని భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని ఆ దేశ పీఎం జస్టిన్ ట్రూడోతో పాటు అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, భారత ప్రభుత్వం ఖలిస్తానీ మద్దతుదారుల్ని లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు లేవని స్వయాన కెనడా పీఎం ట్రూడోనే వెల్లడించాడు. భారత్ గత ఏడాదిగా సాక్ష్యాలు సమర్పించాలని కెనడాని కోరుతోంది.
కెనడా వార్తాపత్రిక ది గ్లోబ్ అండ్ మెయిల్ చెబుతున్న దాని ప్రకారం.. నథాలీ డ్రౌయిన్‌తో పాటు గ్లోబల్ అఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ డేవిడ్ మారిసన్ వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడినట్లు తెలిపింది. కెనడాలో భారత జోక్యంతో పాటు సెప్టెంబర్ 2023న సిక్ లీడర్, ఖలిస్తానీ ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్న సుఖ్‌దూల్ గిల్ హత్యలో భారత జోక్యం గురించి మాట్లాడినట్లు తెలిసింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రేలో హత్య జరిగిన తర్వాత గిల్ హత్య జరిగింది. అయితే, తాము ఎలాంటి సమాచారం పంచుకోలేదని వారిద్దరు చెప్పారు.