iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.
యాపిల్ భారతదేశంలో తన తయారీ నెట్‌వర్క్‌ని వేగంగా విస్తరిస్తోంది. సబ్సిడీలు, నైపుణ్య కలిగిన వర్క్‌ఫోర్స్, దేశంలో సాంకేతిక సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. అమెరికాతో చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కంపెనీలు భారత్‌ని తమ గమ్యస్థానంగా మార్చుకుంటున్నాయి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు భాతర్ ఒక కీలకమైన దేశంగా మారింది.
Read Also: Bhatti Vikramarka: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఇందిరా డెయిరీ..
ఆపిల్ సరఫరాదారులు తైవాన్‌కి చెందిన ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ , పెగాట్రాన్ కార్పొరేషన్, స్వదేశీ టాటా ఎలక్ట్రానిక్స్ దేశంలో ఐఫోన్ అసెంబ్లింగ్ చేస్తున్నాయి. చెన్నై శివార్లలోని ఫాక్స్‌కాన్ స్థానిక యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలోని ఐఫోన్ ఎగుమతుల్లో సగం వాటాని కలిగి ఉంది. టాటా గ్రూప్ యొక్క ఎలక్ట్రానిక్స్ తయారీ విభాగం ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కర్ణాటక రాష్ట్రంలోని దాని ఫ్యాక్టరీ నుండి సుమారు 1.7 బిలియన్ డాలర్ల ఐఫోన్‌లను ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. టాటా ఈ యూనిట్‌ను విస్ట్రోన్ కార్పొరేషన్ నుండి కొనుగోలు చేసింది.
ఫెడరల్ మినిస్ట్రీ ప్రకారం… భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఎక్కువ భాగం ఐఫోన్‌లే. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో అమెరికాకి 2.88 బిలియన్ డాలర్ల్ ఎగుమతులు జరిగాయి. 5 ఏళ్ల క్రితం భారత్‌లోకి యాపిల్ రాకముందు మనదేశ స్మార్ట్‌ఫోన్ వార్షిక ఎగుమతులు 5.2 మిలియన్ డాలర్లు మాత్రమే. యాపిల్ భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కేవలం 7 శాతం కన్నా తక్కువ వాటాని కలిగి ఉంది. షియోమీ, ఒప్పో, వివో వంటి చైనా బ్రాండ్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రాకరం.. 2030 నాటికి భారతదేశ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. మధ్యతరగతి కనుగోలు శక్తి పెరగడం కూడా ఇందుకు కారణం అవుతుంది.