Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రేకి భారీ దెబ్బ.. ఔరంగాబాద్ టికెట్ వాపస్ ఇచ్చిన అభ్యర్థి..
- ఉద్ధవ్ ఠాక్రేకి భారీ షాక్ ఇచ్చిన అభ్యర్థి..
- ఎన్నికల్లో పోటీ చేయనని టికెట్ వాపస్..
- ఔరంగాబాద్ సెంట్రల్ అభ్యర్థిగా పోటీకి నిరాకరణ..
- ఏక్‌నాథ్ షిండేకి మద్దతు ఇస్తున్నట్లుగా వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ తమ అభ్యర్థుల్ని ఖరారు చేశాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు భారీ దెబ్బ పడింది. ఆ పార్టీ నుంచి టికెట్ పొందిన అభ్యర్థి, తాను పోటీ చేయడం లేదని తేల్చి చెప్పాడు. శివసేన-యూటీటీ నుంచి ఔరంగాబాద్‌లో పోటీ చేయడానికి టికెట్ పొందిన అభ్యర్థి కిషన్ చంద్ తన్వానీ తన అభ్యర్థిత్వాన్ని వదులుకున్నారు.
Read Also: Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
తన్వానీ విలేకరులతో మాట్లాడుతూ.. గత 7 రోజులుగా తన నియోజకవర్గంలో ఉన్నానని, అక్కడి పరిస్థితిని చూస్తున్నానని చెప్పారు. దాని ఆధారంగానే తాను పోటీ చేయనని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నామినేషన్ దాఖలుకు గడువు ముగియడానికి ఒక రోజు ముందు ఈ చర్య తీసుకున్నాడు. దీనిపై బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా స్పందిస్తూ.. ఎంవీఏ (మహా వికాస్ అఘాడీ)లో గందరగోళం నెలకొంది, నామినేషన్ ప్రక్రియ ముగియడానికి 24 గంటల ముందు అభ్యర్థులు టిక్కెట్లు తిరిగి ఇస్తున్నారని, పోటీకి నిరాకరిస్తున్నారని అన్నారు. ఉద్ధవ్ సేన సంభాజీ నగర్ (ఔరంగాబాద్ సెంట్రల్) అభ్యర్థి కిషన్‌చంద్ తన్వానీ తన టిక్కెట్‌ను తిరిగి ఇచ్చారని అన్నారు.
తన్వానీ ఏక్‌నాథ్ షిండే శివసేనకు మద్దతు ఇస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీకి చెందిన సచిన్ సావంత్ అంధేరీ వెస్ట్ నుంచి టిక్కెట్ నిరాకరించాడని, బాంద్రా ఈస్ట్‌ని డిమాండ్ చేస్తున్నాడని, ఎంవీఏ పేలుతోందని, శరద్ పవార్ వర్గంలో విభేదాలు ఉన్నాయని అమిత్ మాల్వియా ట్వీట్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెలువడుతాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?