Bangladesh: బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటు.. ఆర్మీ చీఫ్‌కి వ్యతిరేకంగా పాక్ అనుకూల వర్గం కుట్ర..?
- బంగ్లాదేశ్ సైన్యంలో తిరుగుబాటుకు ప్లాన్..
- పాక్ సహకారంలో ప్రణాళిక రచిస్తున్న ఫైజుర్ రెహమాన్..
- ప్రస్తుతం ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌ని దించేందుకు కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: నానాటికి బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాదం, ఉగ్రవాద భావాలు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిందో, అప్పటి నుంచి మహ్మద్ యూనస్ ప్రభుత్వం, పాకిస్తాన్‌తో చెలిమి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్ నుంచి సైనిక సాయాన్ని కోరుతోంది. ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగాయి. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. వీరు భారత సరిహద్దు ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇక బంగ్లాదేశ్ ఆర్మీ అధికారులు, విద్యార్థి నాయకులు పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడి పాక్ ఆర్మీ అధికారులతో భేటీ అవుతున్నారు.
ఇవన్నీ చూస్తే బంగ్లాదేశ్‌లో రానున్న రోజుల్లో ఏదో పెద్ద సమస్య రాబోతున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ సైన్యంలో త్వరలో తిరుగుబాటు వస్తుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్‌ని దించేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ భావాలు కలిగిన, పాక్ అనుకూలుడిగా పేరున్న లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ ఫైజుర్ రెహ్మాన్ పథకం రచిస్తున్నట్లు తెలుస్తోంది. తిరుగుబాటు కోసం అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
Read Also: Beerla Ilaiah: రైతు ధర్నా అని కామెడీ షో నిర్వహించాడు.. కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు
వకార్ ఉజ్ జమాన్ గతంలో షేక్ హసీనా అనుకూలుడిగా ప్రసిద్ధి చెందాడు. స్వయంగా ఆమెతో చుట్టరికం కూడా ఉంది. భారత్ పట్ల అనుకూల వైఖరి ప్రదర్శి్స్తున్నాడని ఆర్మీలోని ఒక వర్గం భావిస్తోంది. మరోవైపు బంగ్లా ఆర్మీలో మరో పవర్ సెంటర్‌గా లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ షాహీనుల్ హక్, మేజర్ జనరల్ మహమ్ద్ మోయిన్ ఖాన్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత వారం బంగ్లాదేశ్ క్వార్టర్ మాస్టర్ జనరల్, ఇస్లామిక్ అనుకూల భావజాలం ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్, గత వారం ఢాకు వచ్చిన పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్‌తో చర్చలు జరిపారు.
ఈ ప్లాన్‌లో భాగంగా బంగ్లా సైన్యంలోని నిఘా విభాగం DGFI నుండి మద్దతును పొందడానికి రెహమాన్ ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న వకార్ ఉజ్ జమాన్, దేశాన్ని పూర్తిగా ఇస్లామిక్ శక్తులు స్వాధీనం చేసుకోకుండా నిరోధిస్తున్నారు. గతేడాది ఆగస్టు 05న షేక్ హసీనా సురక్షితంగా ఇండియా వచ్చేలా జమాన్ చర్యలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ ఆర్మీలో మరో పవర్ సెంటర్‌గా.. కీలకమైన మీర్పూర్ కంటోన్మెంట్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ షాహీనుల్ హక్ ఉన్నారు. బంగ్లా ఆర్మీ 9వ డివిజన్‌కి చెందిన షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి అనుకూల మేజర్ జనరల్‌గా పేరున్న ముహమ్మద్ మోయిన్ ఖాన్ ఆయనకు మద్దతు ఇస్తున్నారు.
లెఫ్టినెంట్ జనరల్ హక్ 2022 విక్టరీ డే పరేడ్ కమాండర్‌గా, గతంలో ఆర్మీ ప్రధాన కార్యాలయంలో జనరల్ స్టాఫ్ చీఫ్‌గా ఉన్నారు. జూలై 1989లో ఆయన పదాతిదళంలో చేరారు. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డ్ కూడా ఈయన అందుకున్నారు. ఈయన గతంలో ఆర్మీ హెడ్‌క్వార్టర్స్, జనరల్ స్టాఫ్ బ్రాంచ్ ఆయుధాలు, పరికాలు గణాంకాల డైరెక్టరేట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!