Bomb threat: న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాన్ని దారి మళ్లించి రోమ్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. రోమ్ విమానాశ్రయంలో భద్రతా అనుమతి పొందిన తర్వాత విమానం మళ్లీ ఢిల్లీ బయలుదేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: IND vs PAK: క్రేజ్ అంటే ఇదేరా.. పెళ్లి వేడుకలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లైవ్
బోయింగ్ 783 డ్రీమ్‌లైనర్ ఫిబ్రవరి 22న జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. బాంబు బెదిరింపులతో యూరప్ తిరిగి వచ్చే ముందు విమానం కాస్పియన్ సముద్రాన్ని దాటింది. “న్యూయార్క్ నుండి ఢిల్లీకి నడుస్తున్న AA 292 విమానంలో భద్రతా ముప్పు ఉన్నందున రోమ్‌కు మళ్లించబడింది” అని ఎయిర్‌లైన్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్థానిక అధికారులతో కలిసి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామంటూ ఎయిర్ లైన్ హామీ ఇచ్చింది.