High Court: కస్టమర్ల ఫుడ్ బిల్లులపై సర్వీస్ ఛార్జీలను చెల్లించడం వారి ఇష్టమని, రెస్టారెంట్లు, హోటళ్లు తప్పనిసరిగా విధించలేవని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. హోటళ్లు, రెస్టారెంట్లు బిల్లులపై సర్వీస్ ఛార్జీలను తప్పనిసరి చేయడాన్ని నిషేధిస్తూ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ, రెస్టారెంట్ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ తన తీర్పులో.. రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదని, వాటిని విధించవద్దని పేర్కొన్నారు.
Read Also: AP Nominated Posts: నామినేటెడ్ పదవుల భర్తీ.. 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన
CCPA మార్గదర్శకాలను సవాలు చేసిన రెస్టారెంట్ సంఘాలపై హైకోర్టు లక్ష రూపాయల రుసుమును కూడా విధించింది. హైకోర్టు వినియోగదారు సంస్థ మార్గదర్శకాలను సమర్థించింది. అథారిటీ కేవలం సలహా సంస్థ కాదని, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి మార్గదర్శకాలను జారీ చేసే అధికారం ఉందని చెప్పింది.