Murshidabad riots: బెంగాల్ ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సంచలన రిపోర్ట్.. ఉగ్రవాదంపై హెచ్చరిక..
- ముర్షిదాబాద్ అల్లర్లపై బెంగాల్ గవర్నర్ సంచలన రిపోర్ట్..
- బంగ్లా సరిహద్దు జిల్లాల్లో రాడికలైజేషన్, ఉగ్రవాదంపై కేంద్రానికి నివేదిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murshidabad riots: గత నెలలో వక్ఫ్ అల్లర్ల పేరుతో బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పుపెట్టారు. ముస్లిం మెజారిటీ కలిగిన ముర్షిదాబాద్ ప్రాంతంలో, హిందువుల ఆస్తులపై దాడులు జరిగాయి. ఈ అల్లర్ల వల్ల వందలాది హిందూ కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అల్లర్లపై బెంగాల్ ప్రభుత్వం, మమతా బెనర్జీలు సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.
ఇదిలా ఉంటే, ముర్షిదాబాద్ అల్లర్లపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సంచలన రిపోర్టు ఇచ్చారు. కేంద్రానికి ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలో ‘‘రాడికలైజేషన్, ఉగ్రవాదం’’పై కేంద్రాన్ని హెచ్చరించారు. హోంమంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలో అల్లర్లకు సంబంధించిన విషయాలను మతోన్మాదం, తీవ్రవాదం బెంగాల్‌కి సమస్యగా మారినట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న అనేక జిల్లాల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నట్లు చెప్పారు.
Also Read
- Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
సరిహద్దు జిల్లాల్లో శాంతిభద్రతల ఆందోళనను నివేదిక హైలెట్ చేసింది. విచారణ కమిషన్ ఏర్పాటు, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్న దుర్బల ప్రాంతాల్లో కేంద్ర బలగాలను శాశ్వతంగా మోహరించడం వంటి అనేక చర్యల్ని నివేదిక సూచించింది. బంగ్లా సరిమ్దదుల్లోని సంక్లిష్టమైన జనాభా స్వరూపం కలిగిన మాల్డా, ఉత్తర దినాజ్‌పూర్ వంటి జిల్లాల్లో హింసకు కారణమయ్యే అవకాశం ఉందని గవర్నర్ బోస్ హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో విభేదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, హింస పెరిగిన నేపథ్యంలో బెంగాల్ సీఎం పదేపదే మైనారిటీ ప్రయోజనాలను రక్షిస్తామని చెప్పడం, ముస్లిం సమాజాన్ని శాంతిపచేసే చర్యలు పెద్దగా ఏం చేయలేదని నివేదికలో చెప్పారు.
Read Also: Jio Recharge: నెలకు కేవలం రూ.81కే అపరిమిత కాల్స్.. బేసిక్ యూజర్ల కోసం ప్రత్యేక ప్లాన్ విడుదల!
గవర్నర్ చేసిన సిఫారసులు ఇవే:
*రాష్ట్ర యంత్రాంగాలు కుప్పకూలినప్పుడు శాంతిభద్రతల సంక్షోభాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి అనుమతించే కేంద్ర చట్టాన్ని ప్రవేశపెట్టడం.
*పరిపాలనా లోపాలను పరిశీలించడానికి, దీర్ఘకాలిక రక్షణలను సూచించడానికి 1952 చట్టం ప్రకారం విచారణ కమిషన్ ఏర్పాటు.
*ముర్షిదాబాద్, మాల్డా వంటి దుర్బల సరిహద్దు ప్రాంతాలలో శాశ్వత BSF, కేంద్ర సాయుధ పోలీసు దళం (CAPF) అవుట్‌పోస్టుల మోహరింపు.
*సరిహద్దు ముప్పులు, సైద్ధాంతిక రాడికలైజేషన్‌ను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న జిల్లాల్లో మెరుగైన నిఘా , నిఘా సమన్వయం.
*పరిస్థితి మరింత దిగజారితే, ఆర్టికల్ 356తో సహా రాజ్యాంగ ఎంపికల అన్వేషణ.
*పౌరులందరి భద్రత, రాజ్యాంగ హక్కులను నిర్ధారించడం అత్యంత ప్రాధాన్యతగా ఉండాలని, శాంతిభద్రతల నిష్క్రియాత్మకత లేదా రాజకీయీకరణ దేశ లౌకిక మరియు ప్రజాస్వామ్య నిర్మాణాన్ని బెదిరిస్తుందని గవర్నర్ ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!