Venu Goapl Reddy
Author- NTV Telugu-
Assam Floods: అస్సాంలో భారీ వరదలు… ఆరు జిల్లాలపై ఎఫెక్ట్
అకాల వర్షాలు అస్సాంను ముంచెత్తుతున్నాయి. వర్షాల వల్ల అస్సాంలోని 6 జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. వర్షాల వల్ల మెరుపు వరదలు సంభవించాయి. వాగులు, నదులు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరుగిపడుతున్నాయి. ఈ ఏడాదిలో తొలిసారి అస్సాంను వరదలు ముంచెత్తాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. డిమా హసావో జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. […] -
North korea: కిమ్ రాజ్యంలో కరోనా ప్రకంపనలు… 42కు చేరిన మరణాలు
ఉత్తర కొరియా ఓ రహస్య దేశం. ప్రపంచంలో ఏం జరుగుతుందో నార్త్ కొరియా ప్రజలకు… నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడం చాలా తక్కువ. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ చెప్పిందే వేదం, చేసిందే చట్టం. వింతవింత రూల్స్, చిత్ర విచిత్రంగా ఉండే దేశం ఉత్తర కొరియా. ఇదిలా ఉంటే ఇప్పుడు అలాంటి దేశాన్ని కరోనా భయపెడుతోంది. కిమ్ రాజ్యంలో కోవిడ్ -19 తీవ్రంగా విజృంభిస్తోంది. ఎంతలా అంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఈ […] -
Congress: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రాహుల్ గాంధీ కాశ్మీర్ టూ కన్యాకుమారి యాత్ర..!
కాంగ్రెస్ పార్టీ తనను తాను సంస్కరించుకోవాలని చూస్తోంది. దీనికి రాజస్తాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న ‘ నవ కల్పన్ శింతన్ శిబిర్’ వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘ ఒక కుటుంబం- ఒక సీటు’ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తనపై ఉన్న కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకోవాలని అనుకుంటోంది. దీంతో పాటు పార్టీలో పనిచేసే వారికి మాత్రమే పదవులు, టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. […] -
G7- India: గోధుమల ఎగుమతులను నిలిపేస్తే సంక్షోభం తీవ్రం అవుతుంది
భారత్ గోధుమల ఎగుమతులను బ్యాన్ చేసింది. దేశీయంగా ధరలు పెరడటంతో ధరలను కంట్రోల్ చేసే ఉద్దేశంతో విదేశాలకు గోధమ ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ( డిజిఎఫ్టీ) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది. ఇండియాలో ఆహర భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఎగుమతులు చేయడానికి మాత్రం అనుమతులు ఇచ్చింది. కాగా ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచాన్ని భయపెడుతున్నట్లు […] -
Asaduddin Owaisi: జ్ఞానవాపిపై కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ మౌనం ఎందుకు..?
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జ్ఞానవాపి మసీదుపై రచ్చ నడుస్తోంది. వారణాసి కోర్ట్ మసీదు వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. ఓ వర్గం వారు కోర్ట్ ఆదేశాలను వ్యతిరేఖిస్తున్నారు. మసీదు మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసి ఈనెల 17న రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోర్ట్ కమిషనర్ ను ఆదేశింది. మసీదు వెలపల గోడపై హిందూ దేవత విగ్రహాలు ఉన్నాయని.. మాకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించడంతో కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా […] -
Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం
ఢిల్లీలో ముండ్కా అగ్ని ప్రమాదం మరవక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముండ్కాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా…మరో కొంత మంది ఆచూకీ గల్లంతైంది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని నరేలా లోని ఓ ప్లాస్టిక్ గ్యాన్యులేషన్ ఫ్యాక్టరీలో శనివారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరి పెద్ద ప్రమాదం ఏర్పడకుండా రక్షించారు. […] -
Imran Khan: పాకిస్తాన్ పై అణు బాంబు వేయడం బెటర్
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దోపిడీ ప్రభుత్వంగా అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ను దొంగల చేతిలో పెట్టడం కన్నా అణుబాంబు వేయడం మంచిదంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్-ఇ- ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షహబాజ్ షరీఫ్, ఆయన పార్టీ […] -
USA: అమెరికాలో దారుణం… కాల్పుల్లో 10 మంది మృతి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( […] -
Sheikh Mohamed: యూఏఈకి కొత్త అధ్యక్షుడు
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్( యూఏఈ) అధ్యక్షుడిగా ఉన్న షేక్ ఖలీఫా బిన్ ఆల్ నెహ్యాన్ మరణించడంతో కొత్త పాలకుడి ఎంపిక అనివార్యంగా మారింది. దీంతో కొత్త పాలకుడిగా షేక్ మహ్మద్ బిన్ జయాద్ ఆల్ నెహ్యన్ ను ఎన్నుకుంది ఫెడరల్ సుప్రీం కౌన్సిల్. ఎంబీజెడ్ గా పిలువబడే మహ్మద్ బిన్ జాయెద్ అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన నేతగా ఉన్నారు. ఎంబీజెడ్ ఎన్నికైన తర్వాత యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి యూఏఈ రాజ్యాంగం ప్రకారం […] -
Congress: కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం… ఒకరికి రెండు సార్లు మాత్రమే రాజ్యసభ సీటు..!
కాంగ్రెస్ తనను తాను నవీకరించుకోవాలనుకుంటోంది. ఇందుకు రాజస్తాన్ ఉదయ్ పూర్ వేదికగా జరుగుతున్న ‘నవ సంకల్ప్ శింతన్ శిబిర్’ వేదిక అవుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ‘ ఒక కుటుంబం- ఒక టికెట్’ అనే పాలసీని తీసుకువచ్చింది. ఎంతటి పెద్ద నేతలైనా వారి కుటుంబాల వ్యక్తులకు టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. టికెట్ పొందాలంటే ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఉండాలనే నియమాలను తీసుకువచ్చింది. శింతన్ శిబిర్ తొలి రోజే సోనియాగాంధీ తన అధ్యక్ష ఉపన్యాసంలో కాంగ్రెస్ […]
తాజావార్తలు
-
JD Vance: వలసల్ని ప్రోత్సహించి అనుభవిస్తున్నారు.. ఫ్రాన్స్ అల్లర్లపై యూఎస్ ఉపాధ్యక్షుడు..
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!