Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy F70 5G Launched in India: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రముఖ సంస్థ సామ్ సంగ్ కొత్త 5G ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. Samsung Galaxy F70 5G పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.20 వేలలోపు కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఫోన్ మంచి ఆప్షన్ గా నిలవనుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, కెమెరా వివరాలను తెలుసుకుందాం.
Samsung Galaxy F70 5G స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.17,999గా ఉంది. ఈ ఫోన్ తొలి విక్రయాలు 2026 అక్టోబర్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్, సామ్ సంగ్ అధికారిక భారత వెబ్‌సైట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అవి Vivid Violet, Bold Black.
Also Read
- Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
- Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్ప్లే
ఈ ఫోన్లో 6.7 అంగుళాల Super AMOLED డిస్ప్లేను అందించారు. 90Hz వరకు రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటంతో స్క్రోలింగ్, రోజువారీ వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించనుంది. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్ కూడా ఉంది. పనితీరు కోసం 5nm టెక్నాలజీతో రూపొందించిన Exynos 1330 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం Mali-G68 MP2 GPUను అందించారు. ఈ ఫోన్ Android 17 ఆధారిత One UI 9.5పై పనిచేస్తుంది. అలాగే మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే సదుపాయం కూడా ఉంది.
50MP ట్రిపుల్ కెమెరా సెటప్
ఫొటోగ్రఫీ కోసం Samsung Galaxy F70 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు.
50MP ప్రైమరీ కెమెరా: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది.
5MP అల్ట్రా వైడ్ కెమెరా: విస్తృత దృశ్యాలను ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది.
2MP మ్యాక్రో కెమెరా: దగ్గరి నుంచి చిన్న వస్తువులను ఫొటోలు తీయడానికి ఉపయోగపడుతుంది.
13MP ఫ్రంట్ కెమెరా: సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అందించారు.
ముందు, వెనుక కెమెరాలతో 1080p రిజల్యూషన్‌లో సెకనుకు 30 ఫ్రేమ్‌ల వేగంతో వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 25W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అదనంగా, ఫోన్‌కు IP54 రేటింగ్ ఉంది. ఇది దుమ్ము, నీటి తుంపర్ల నుంచి కొంతవరకు రక్షణ కల్పిస్తుంది. కనెక్టివిటీ పరంగా డ్యూయల్ సిమ్, Wi-Fi 5, Bluetooth 5.3, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G లాంచ్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Super AMOLED డిస్ప్లే!
-
WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
-
YS Jagan: గెలుస్తామనే నమ్మకం చంద్రబాబుకు లేదు.. 2029 ఫినిషింగ్ లైన్!
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!