Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shai Hope: భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసిన వెస్టిండీస్ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ షాయ్ హోప్ చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం సిరీస్‌లు గెలవడమే కాకుండా, జట్టులో వస్తున్న పురోగతిని కూడా విజయాలుగానే భావించాలని అభిప్రాయపడ్డాడు. బెంగళూరులో జరగాల్సిన ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మ్యాచ్ డ్రాగా మిగిలిన విషయం తెలిసిందే. భారత్గడ్డపై గత రెండు దశాబ్దాలకు పైగా దక్కని ద్వైపాక్షిక సిరీస్ విజయం కోసం విండీస్ నిరీక్షణ అలాగే కొనసాగినప్పటికీ, ఈ సిరీస్ ద్వారా ఆటగాళ్లు చూపిన ఐక్యత, ప్రదర్శన అద్భుతంగా ఉందని హోప్ కొనియాడాడు. ఇక్కడ సిరీస్ గెలిచి ఇరవై ఏళ్లకు పైగా అయిందని, ఈ స్థాయి వరకు వచ్చి పోటీ పడటం తమ జట్టు ఎంతగా మెరుగైందో చెప్పకనే చెబుతోందన్నాడు. సిరీస్ విజయాలకంటే ఆటగాళ్లలో వస్తున్న ప్రగతి తమకు ఎంతో ముఖ్యమని హోప్ పేర్కొన్నాడు.
ఈ సిరీస్ అంతటా బౌలర్లు అందించిన సహకారాన్ని షాయ్ హోప్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. కీమో పాల్ 8 వికెట్లు పడగొట్టగా, షమర్ స్ప్రింగర్ 7 వికెట్లు, రోస్టన్ చేజ్ 6 వికెట్లు సాధించారు. గత మ్యాచ్‌లో కీమో పాల్ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగి, 248 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడని హోప్ గుర్తుచేశాడు. బౌలింగ్ విభాగంలో షమర్ స్ప్రింగర్ వచ్చి డెత్ ఓవర్లలో కీలక పాత్ర పోషించాడని, కీమో పాల్, రోస్టన్ చేజ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు. అందరూ కలిసికట్టుగా రాణించడం తమ జట్టుకు ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నాడు.
Also Read
- West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
- YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
- CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
- General Syed Amar Raza: "పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం".. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును గెలుచుకున్న షాయ్ హోప్, తన బ్యాటింగ్ విజయ రహస్యం గురించి కూడా మాట్లాడాడు. కేవలం ఆత్మవిశ్వాసంతో, తన పాత పద్ధతులకే కట్టుబడి ఆడటమే తన విజయానికి కారణమని స్పష్టం చేశాడు. కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 190కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాయంతో మొత్తం 261 పరుగులు సాధించిన హోప్.. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ తనపై తనకు పూర్తి నమ్మకం ఉంటుందని, తన ప్రక్రియ ఎప్పటికీ మారదని, ఎప్పుడూ ప్రశాంతంగా, తటస్థంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని చెప్పాడు.
డ్రాగా ముగిసిన మ్యాచ్..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇషాన్ కిషన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఆఖరి మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో, ఓవర్లను కుదించి ఒక్కో వైపునకు తొమ్మిది ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసిన దశలో మరోసారి వర్షం కురవడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేశారు. దీంతో సిరీస్ 2-2తో సమం కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి.
ఇక, టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే అభిషేక్ శర్మ (6) సిక్స్ బాదిన వెంటనే షమర్ జోసెఫ్ చేతిలో మిడ్ వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 0.5 ఓవర్లలోనే భారత్ 13 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. అయితే, ఆ తర్వాత ఇషాన్ కిషన్ రొమారియో షెపర్డ్ వేసిన ఓవర్లో విరుచుకుపడి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఆ ఓవర్ మొదటి బంతిని ఫైన్ లెగ్ పై నుంచి సిక్స్ కొట్టిన ఇషాన్, ఆ తర్వాత ఒక ఫోర్, సిక్స్, మరో ఫోర్ బాదాడు. ఆ ఓవర్లో వైడ్ రూపంలో వచ్చిన పరుగుతో కలిపి మొత్తంగా 24 పరుగులు వచ్చాయి. దీంతో రెండు ఓవర్లకే భారత్ స్కోరు 38 పరుగులకు చేరుకుంది.
మూడో ఓవర్ ఆరంభంలోనూ ఇషాన్ కవర్ రీజియన్‌లో ఫోర్ బాదినప్పటికీ, అదే బౌలర్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇషాన్ కేవలం 10 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసి వెనుదిరిగగా.. ఆ ఓవర్ చివరిలో సంజూ శాంసన్ డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ పై నుంచి ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టడంతో 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 55/2కి చేరింది. గుడాకేష్ మోతీ వేసిన నాల్గో ఓవర్ కాస్త నిదానంగా సాగింది. ఆ ఓవర్లో సంజూ ఒక ఫోర్ కొట్టడంతో మొత్తంగా 10 పరుగులు వచ్చాయి. అయితే, షమర్ స్ప్రింగర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ (16) బౌల్డ్ అయ్యాడు. దీంతో 4.1 ఓవర్లలో భారత్ 66 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఐదు ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 73/3గా ఉంది. ఆ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్లో శ్రేయస్ అయ్యర్ గూడకేష్ బౌలింగ్‌లో రెండు చక్కటి ఫోర్లు బాదాడు. ఇదే సమయంలో ఓ రనౌట్ ప్రమాదం నుంచి కూడా అతను బయటపడ్డాడు. అయితే తన ఇన్నింగ్స్‌ను పెద్దగా దూకుడుగా మార్చలేకపోయిన శ్రేయస్… కేమో పాల్ బౌలింగ్‌లో షమర్ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రేయస్ 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. దీంతో 6.1 ఓవర్లలో భారత్ 88/4 పరుగులతో నిలిచింది. ఇక, క్రీజులోకి వచ్చిన నమాన్ ధీర్ రాగానే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతుల్లోనే కేమో పాల్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్, సిక్స్ బాది తన దూకుడును చాటాడు. దీంతో 6.4 ఓవర్లకే భారత్ వంద పరుగుల మార్క్‌ను దాటింది. ఇక ఇన్నింగ్స్ 7.4 ఓవర్ల వద్ద షమర్ స్ప్రింగర్ బౌలింగ్‌లో తిలక్ వర్మ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్ స్కోరు 118/5 వద్ద ఉన్న ఈ సమయంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత పరిస్థితులు కుదుటపడకపోవడంతో మ్యాచ్ రద్దయినట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
-
West Bengal Govt: కోల్‌కతా తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
-
YS Jagan: చంద్రబాబు రక్తచరిత్ర రాస్తున్నారు.. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది!
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!