Venu Goapl Reddy
Author- NTV Telugu-
Etela Rajender: సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ…
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ పై బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు పేల్చారు. సీఎం కేసీఆర్ కూట్లో రాయి తీయలేడు కానీ.. ఏట్లో రాయి తీస్తానని ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ఆయన విమర్శించారు. తెలంగాణలో పెన్షన్లు రెండు మూడు నెలలకు ఒకసారి వస్తున్నాయని… ఉద్యోగాలకు జీతాలు లేవని… మధ్యాహ్న భోజనం వండేవారికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే…గతి లేక […] -
K.A. Paul: నేను ప్రశ్నిస్తేనే కేసీఆర్ స్పందించారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 31 సంవత్సరాలకు పెంచాలని అడిగానని… సీఎం కేసీఆర్ 32 ఏళ్లకు పెంచారని… నేను డిమాండ్ చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ స్పందించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. మీరు ఉద్యోగాలు ఇస్తోంది వేలల్లో ఉన్నాయని… మిగితా నిరుద్యోగుల పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు కేఏ పాల్. గత ఎనిమిదేళ్ల నుంచి మీకు చెబుతున్నా… వేడుకున్నా ప్రజాసమస్యలపై కేసీఆర్ స్పందించడం లేదని అన్నారు. ప్రజాశాంతి పార్టీ బడుగు, […] -
Dasoju Sravan: తెలంగాణ రక్తమాంసాలను కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నాడు.
తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాను సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు సాయంగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా…? అని సెటైర్లు వేశారు. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవాలనే స్వార్థంతోనే ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా సీఎం కేసీఆర్ సంఘీభావం […] -
Telangana Formation Day: సీఎస్ సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి సమీక్ష
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2022 జూన్ 2 నాటికి ఎనిమిదేళ్లు పూర్తవుతుంది. మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అవతరణ రోజు రాబోతుండటంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. దీంట్లో భాగంగా సీఎస్ సోమేష్ కుమార్ రాష్ట్ర అవతరణ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 వ తేదీన ఉదయం […] -
Gyanavapi Mosque: సుప్రీం కీలక తీర్పు… జ్ఞానవాపీ మసీదు కేసు జిల్లా కోర్టుకు బదిలీ
సుప్రీంకోర్ట్ లో జ్ఞానవాపీ విచారణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా జ్ఞానవాపీ మసీదు వ్యవహారం మారింది. రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదం కావడంతో సుప్రీం కోర్ట్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే సుప్రీం కోర్ట్ ఈ వ్యవహారాన్ని వారణాసిజిల్లా కోర్ట్ లోనే విచారించాలనే నిర్ణయంపై మొగ్గు చూపింది. జిల్లా జడ్జీ ఈ విచారణను చేపడితే బాగుంటుందని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. సీనియర్, అనుభవం ఉన్న జడ్జీ ఈ కేసును విచారిస్తారని సుప్రీం కోర్ట్ […] -
KCR: కేసీఆర్ ఆలిండియా టూర్ షురూ..!!
సీఎం కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనకు వెళ్లనున్నారు. నేటి నుంచి వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గతంలో రైతు ఉద్యమ సమయంలో హామీ ఇచ్చిన విధంగా రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు నష్ట పరిహారం అందించనున్నారు. ఇదే విధంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలతో చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఢిల్లీలో ఆర్థికవేత్తలు, జర్నలిస్టులతోె కేసీఆర్ సమావేశం కానున్నారు. మే 21న చంఢీగడ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి […] -
Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ ఫేక్… తేల్చిన సిర్పూర్కర్ కమిషన్
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసులో పోలీసులు కట్టుకథలు చెప్పారని.. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని […] -
Prashanth reddy: నిఖత్ జరీన్ కు వ్యక్తిగతంగా రూ. లక్ష ప్రోత్సాహం
నిఖత్ జరీన్ విజయం తెలంగాణ కే గర్వకారణం అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం హర్షణీయని అన్నారు. జరీన్ ఘన విజయంతో తెలంగాణ, నిజమాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం నలుదిశలా మరింతగా వ్యాపించనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రీడలు,క్రీడాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని, ప్రోత్సహిస్తున్నది చెప్పడానికి జరీన్ విజయమే అందుకు నిదర్శనమని..నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమైన జరీన్ కు వ్యక్తిగతంగా […] -
Nikhat Zareen: సత్తా చాటిన తెలంగాణ బిడ్డ… ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచింది తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్. తెలంగాణ నిజామాబాద్ కు చెందిన 25 ఏళ్ల నిఖత్ జరీన్ ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిత్పోంగ్ జుటామాను ఓడించి .. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల విభాగంలో నిఖత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. భారత్ తరుపున గతంలో మేరికోమ్, […] -
Harish rao: ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8 శాతం పెరిగిన ఆరోగ్య శ్రీ సేవలు
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 8 శాతం పెరిగాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ పథకం అమలు, పురోగతిపై ఆయన నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019-20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు 35 శాతం ఉంటే 2021-22లో 43 శాతం పెరిగాయని హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు పేదలకు వైద్యఖర్చులు భారం లేకుండా చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అన్ని జిల్లాలు, ఏరియా […]
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!