Israel Iran War: ఇజ్రాయిల్ ఏడో రోజు కూడా ఇరాన్‌పై భీకర దాడిని కొనసాగించింది. గురువారం రాత్రిపూట ఇరాన్ లోని అరక్ అణు రియాక్టర్‌ని లక్ష్యంగా చేసుకుని, నటాజ్ ప్రాంతంలోని అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాన్ అణు కేంద్రాల్లో పాక్షికంగా నిర్మించిన ‘‘హెవీ వాటర్ రియాక్టర్’’ ఉంది. దీనిని మొదట అరక్ అని, ఇప్పుడు ఖోడాబ్ అని పిలుస్తున్నారు.
Read Also: PM Modi: రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ..
ఖోండాబ్ అణు కేంద్ర ప్రాంతంలో ఎయిర్ డిఫెన్స్ యాక్టివేట్ చేయబడిందని, రెండు దాడులు దానికి దగ్గరగా ఉన్న ప్రాంతాన్ని తాకాయని ఇరాన్ మీడియా గురువారం ఉదయం నివేదించింది. ఈ దాడులకు ముందే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించామని, రేడియేషన్, ప్రాణ నష్టం సంభవించే అవకాశం లేదని ఇరాన్ అధికారులు చెప్పారు. అయితే, నష్టం గురించి వెల్లడించలేదు.
ఇరాన్‌లోని నటాంజ్ ప్రాంతం ఆ దేశ అణు కార్యక్రమాలకు గుండె లాంటిది. తాజా దాడిలో ఇజ్రాయిల్ సైన్యం అరక్‌లోని రియాక్టర్ కోర్ సీల్ నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఫ్లూటోనియం ఉత్పత్తిలో కీలకమైన భాగంగా ఉంది.