Honeymoon Murder Case: ఇటీవల మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హనీమూన్ నెపంతో రాజాను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య సోనమ్ దారుణంగా హత్య చేయించింది. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి సోనమ్ ఈ దారుణానికి ప్లాన్ చేసింది. ఈ హత్య కోసం ముగ్గురు హంతకులను నియమించుకున్నారు. మే 23న రఘువంశీ హత్య జరగగా, జూన్ 02న అతడి మృతదేహం మేఘాలయలోని తూర్పు కాసీ కొండల్లో గుర్తించారు. ఆ తర్వాత సోనమ్ ఈ హత్య కేసులో యూపీ ఘాజీపూర్ పోలీసులు ముందు లొంగిపోయింది. ప్రస్తుతం నిందితులంతా అరెస్టయ్యారు.
Read Also: Physical Harassment Case: క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. కోచ్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
అయితే, ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేఘాలయ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక బృందం (సెట్) ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ సహాయంతో రాజ రఘువంశీకి హత్యకు సంబంధించిన ఒక దేశీయ పిస్టల్, మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తూర్పు ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సయీమ్ మాట్లాడుతూ.. ఈ కేసులో మరో నిందితుడు ఆస్తి వ్యాపారి అయిన సిలోమ్ జేమ్స్‌ను విచారించినట్లు చెప్పారు. ఇతడి సమాచారం ఆధారంగా ఇండోర్ ఒక వాగు నుంచి 32 రౌండ్ల రెండు మ్యాగజైన్స్‌లతో పాటు ఒక దేశీయ తయారీ హ్యాండ్ గన్‌ని సిట్ స్వాధీనం చేసుకుంది.
పోలీసులు అతడి కారు నుంచి రూ. 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను రాజ్ కుష్వాహా ల్యాప్ లాప్ బ్యాగ్ నుంచి నగదు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాగ్‌ను తగలబెట్టి, ల్యాప్‌టాప్‌ను రోడ్డు పక్కన ఎక్కడో విసిరివేసినట్లు పోలీసులు తెలిపారు, దాని కోసం పోలీసులు వెతుకుతున్నారు. మే 23న సోనమ్ తన భర్తను హత్య చేసిన తర్వాత ఇండోర్‌కు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆభరణాలను మేఘాలయ సిట్ ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈ కేసులో ఆస్తి డీలర్‌తో సహా ముగ్గురిని సాక్ష్యాలు తారుమారు చేసినందుకు అరెస్ట్ చేశారు. ఇందులో ఇద్దరు ప్లాట్ యజమాని కేంద్ర తోమర్, సెక్యూరిటీ గార్డ్ బల్వీర్ ఉన్నారు. వీరిని గురువారం షిల్లాంగ్‌కు తీసుకువచ్చి స్థానిక కోర్టుకు తరలిస్తామని పోలీసు వర్గాలు తెలిపాయి. తదుపరి విచారణ కోసం పోలీసులు వారి రిమాండ్‌ను కోరనున్నారు.