woman molested in train, killed by being thrown from a train: హర్యానాలో దారుణం జరిగింది. కొడుకుతో రైలులో ప్రయాణిస్తున్న 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడు ఓ దుర్మార్గుడు. యువతి ప్రతిఘటించడంతో రైలు నుంచి నిర్ధాక్షిణ్యంగా తోసేసి చంపారు. నడుస్తున్న రైలు నుంచి కింద పడటంతో తీవ్రగాయాలై మహిళ మరణించింది. రైలులో ఒంటరిగా తల్లి కోసం ఏడుస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు.
వివరాల్లోకి వెళితే హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మహిళ తన తొమ్మిదేళ్ల కుమారుడితో రైలులో ప్రయాణిస్తోంది. అయితే ఆ సమయంలో బోగీ మొత్తం ఖాళీగా ఉంది. మహిళతో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. దీంతో ఇదే అదనుగా భావించిని నిందితుడు మహిళపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను రైలు నుంచి తోసేసి.. తను కూడా రైలు నుంచి దూకాడు. ఈ విషయాలను మహిళ కుమారుడు తెలియజేశారు.
Read Also: Madhya Pradesh: మధ్యప్రదేశ్ “సీరియల్ కిల్లర్” అరెస్ట్..
గత కొంత కాలంగా రోహ్ తక్ లో ఉంటున్న మహిళ గురువారం రాత్రి 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోహానా పట్టణానికి బయలుదేరింది. స్టేషన్ కు మరో 20 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు భర్తను స్టేషన్ కు రావాల్సిందిగా కోరింది. అయితే స్టేషన్ కు వచ్చిన భర్తకు ఏడుస్తున్న కుమారుడు మాత్రమే కనిపించాడు. విషయం ఆరా తీయగా.. ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
నిందితుడిని సందీప్ (27)గా పోలీసులు గుర్తించారు. రైలు నుంచి దూకగా.. తీవ్ర గాయాలైన అతడిని రైల్వే పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడిని అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా మహిళ కోసం రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు వెతుకడం ప్రారంభించారు. ట్రాక్ సమీపంలో పెద్ద పెద్ద పొదలు ఉండటం, రాత్రి సమయం కావడంతో వెతకడం కష్టంగా మారింది. శుక్రవారం ఉదయం ట్రాక్ సమీపంలో మహిళ మృతదేహాన్ని కనుక్కున్నారు. రాత్రి వేళల్లో రైల్వే కోచుల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉందని..అయితే భద్రతా లోపం వల్ల ఈ ఘటన జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.