Papua New Guinea earthquake: ద్వీపదేశం పాపువా న్యూగినియాలో ఆదివారం ఉదయం తీవ్రమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. తూర్పు న్యూగినియా ప్రాంతంలోని కైనాంటు పట్టణంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం కేంద్ర భూమికి 61.4 కిలోమీటర్లత లోతులో కేంద్రీకృతం అయింది. కైనాంటు పట్టణానికి 67 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. జనాభా తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పెద్దగా నష్టం వాటిల్లనట్లు తెలుస్తోంది.
Read Also: Afghanistan: అమెరికా వదిలిన హెలికాఫ్టర్ నడపాలనుకున్న తాలిబాన్లు.. చివరకు..
ఫసిఫిక్ తీరంలో ఉండే ఈ దేశంలో భారీ భూకంప కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఏర్పడింది. అయితే అలాంటిదేం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన సమాచారం రాలేదు. పాపువా న్యూగినియా పసిఫిక్ మహా సముద్రంలోని ‘‘ రింగ్ ఆఫ్ ఫైర్’’ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో తరుచుగా భూకంపాలు, సముద్రంలోపల అగ్నిపర్వతాలు బద్ధలు అవుతుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దీంతో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.
1990 నుంచి న్యూగినియాలో 7.5, అంతకన్నా ఎక్కువ తీవ్రతతో 22 భూకంపాలను నమోదు అయ్యాయి. 1996లో ఇండోనేషియా, ఉత్తర పాపువా ప్రావిన్స్ లో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 166 మంది చనిపోయారు. శనివరాం ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో భూకంపం వచ్చింది. 6.2-5.5 తీవ్రత మధ్య నాలుగు భూకంపాలు నమోదు అయినట్లు ఇండోనేషియా వాతారణ విభాగం ప్రకటించింది.