3.8 Magnitude Earthquake In Haryana, Tremors Felt In Delhi: కొత్త సంవత్సరంలో మొదటి రోజే భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున హర్యానాలోని ఝజ్జర్ లో రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపం ధాటికి ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చాయి. హర్యానా భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదు. భూ ఉపరితలానికి 5 కిలోమీటర్లలో లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయింది. అంతకు ముందు నవంబర్ నెలలో నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ ప్రకంపనలు వచ్చాయి.
Read Also: Malavika Sharma : బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్ నెస్ పెంచి.. మైండ్ బ్లాక్ చేస్తోందిగా
ఇటీవల తరుచుగా హిమాలయ రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రతతో భూకంపాలు రావడం ప్రజల్ని కలవరపరుస్తోంది. హిమాలయ దేశం నేపాల్ లో కూడా భూకంపాలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల భూకంపాలు వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. భూ అంతర్భాగాల్లో జరిగే చర్యల వల్ల ఈ శక్తి భూకంపాలుగా మారుతున్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేటును ఉత్తరం దిశగా నెట్టివేస్తోంది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాలుగ సాగుతోంది. గతంలో ఈ రెండు టెక్టానిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్లే హిమాలయాలు ఏర్పాడ్డాయి. అయితే ఎప్పుడో ఓ రోజు హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.