physical assault on old woman: దేశంలో రోజుకు ఏదో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వావీ వరసలు మరిచి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ ఘటన జరిగింది. సొంతూర్లో దిగబెడతానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు.
Read Also: Bank Robbery: బ్యాంక్ అధికారే దొంగైన వేళ.. 19 కోట్లు స్వాహా
పూర్తి వివరాల్లో వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని షాడోల్ జిల్లాలో 90 ఏళ్ల వృద్దురాలిపై మోటార్ సైకిలిస్ట్ ఆమెకు లిఫ్ట్ ఇస్తానని అత్యాచారం చేసినట్లు శనివారం పోలీసులు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో తన బంధువులను సందర్శించేందుకు వృద్ధ మహిళ గురువారం రాత్రి జబల్ పూర్ నుంచి షాదోల్ రైల్వే స్టేషన్ చేరుకున్నట్లు ఎస్పీ కుమార్ ప్రతీక్ తెలిపారు.
రాత్రిపూట రైల్వే స్టేషన్ లో బసచేసింది. ఆటోరిక్షా డ్రైవర్ ఆమెను శుక్రవారం ఉదయం అంట్రా గ్రామంలోని మెయిన్ రోడ్డులో విడిచిపెట్టాడు. అక్కడ నుంచి వేరే వాహనంలో గ్రామానికి వెళ్లాలని అతడు సూచించాడు. ఆమె బస్సు కోసం ఎదురు చూస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ పై వచ్చి, అదే గ్రామానికి వెళ్తున్నానని చెప్పి లిఫ్ట్ ఇచ్చాడు. అయితే కొంతసేపటికి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఆమెను మెయిన్ రోడ్డుపై వదిలి వెళ్లాడని ఎస్పీ వెల్లడించాడు. బంధువులకు విషయాన్ని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించాడు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, అత్యాచారం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.