Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో బయటపడిన లిథియం నిల్వలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lithium Reserves: దేశంలో తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ లో లిథియం నిల్వలను కనుక్కున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 5.9 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. లిథియం నాన్-ఫెర్రస్ మెటర్. సెల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో లిథియంను విరివిగా ఉపయోగిస్తారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో ఈ నిల్వలు ఉన్నట్లు గనుల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.
Read Also: Vande Bharat trains: నేడు మరో రెండు వందేభారత్ ట్రైన్స్‌ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
లిథియంతో పాటు బంగారానికి సంబంధించి 51 మినరల్ బ్లాకులను ఆయా రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించింది. ఇందులో 5 బ్లాక్ లు బంగారానికి సంబంధించినవి కాగా.. పొటాష్, మాలిబ్డినం, బేస్ మెటల్స్ మొదలైన ఖనిజాల బ్లాకులు ఉన్నాయి. ఇవి జమ్మూ కాశ్మీర్ తో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, జార్ఖండ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ మొత్తం 11 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే ఆధారంగా 2018-19 ఫీల్డ్ సీజన్ నుంచి ఈ బ్లాకులను ఏర్పాటు చేసింది
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వ్యూహాత్మక, కీలకమైన ఖనిజాలపై 115 ప్రాజెక్టులు, ఎరువుల ఖనిజాలపై 16 ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. 2023-24 ఏడాదిలో 12 సముద్ర ఖనిజ పరిశోధన ప్రాజెక్టులతో సహా 318 ఖనిజ అన్వేషణ ప్రాజెక్టులతో కూడిన 966 కార్యక్రమాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపడుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. జియోఇన్ఫర్మేటిక్స్‌పై 55 ప్రోగ్రామ్‌లు, ఫండమెంటల్ అండ్ మల్టీడిసిప్లినరీ జియోసైన్స్‌లపై 140 ప్రోగ్రామ్‌లను, శిక్షణ మరియు సంస్థాగత సామర్థ్యం పెంపు కోసం 155 ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రైల్వేలకు బొగ్గు నిక్షేపాలను వెలికి తీయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)ని 1851లో స్థాపించారు. తర్వాతి కాలంలో భౌగోళిక శాస్త్రం, ఖనిజాల పరిశోదన, భూకంపాలు ఇలా పలు రంగాలపై అధ్యయనం చేస్తోంది.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!